BCCI announce squad for Asia Cup 2018 ఆసియాకప్: రోహిత్ కు కెప్టెన్సీ పగ్గాలు.,

Asia cup 2018 kohli rested rayudu pandey jadhav return

ambati rayudu, Asia Cup 2018, India, Kedhar Jadhav, Manish Pandey, rohit sharma, virat kohli, BCCI, cricket, cricket news, sports news, latest sports news, sports

Rohit Sharma will lead India in the absence of Virat Kohli (rested) in the upcoming Asia Cup, The MSK Prasad-led BCCI selection committee have recalled Kedar Jadhav, Ambati Rayudu and Manish Pandey to the ODIs.

ఆసియాకప్: రోహిత్ కు కెప్టెన్సీ పగ్గాలు., కోహ్లీకి రెస్టు..

Posted: 09/01/2018 06:42 PM IST
Asia cup 2018 kohli rested rayudu pandey jadhav return

ఇంగ్లాండ్ తో సుదీర్ఘ పర్యటనకు వెళ్లిన టీమిండియా జట్టు.. అటు నుంచి అటే యూఏఈ వేదికగా ఈ నెల 15 నుంచి జరగనున్న ఆసియా కప్‌ లో పాల్గొననుంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ అడే జట్టును ఇవాళ బిసిసిఐ ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలో బిసిసిఐ సెలక్షన్ కమిటీ అసియా కస్ బరిలో దిగే భారత జట్టును ప్రకటించింది. ఈ టోర్నీలో విరాట్ కోహ్లీకి రెస్టును ఇచ్చిన కమిటీ.. రోహిత్‌ శర్మకు టీమిండియా నాయకత్వ బాధ్యతలను అందించింది.

వరుసగా మూడు ఫార్మాట్లు ఆడుతోన్న భారత పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతిని కల్పించారు. శిఖర్‌ ధావన్‌ వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు తీసుకోనున్నాడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంపికైన హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడు ఆ తర్వాత యో యో టెస్టులో విఫలమై ఆ పర్యటనకు దూరమయ్యాడు. కొద్ది రోజుల క్రితం యో యో టెస్టులో విజయవంతమైన రాయుడు ఇప్పుడు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడిన రాజస్థాన్ కు చెందిన ఖలీల్‌ అహ్మద్ కు తొలిసారి జట్టులో చోటు దక్కింది. కోహ్లీతో పాటు హార్దిక్‌ పాండ్యకు కూడా ఆసియా కప్‌ నుంచి విశ్రాంతి ఇస్తారంటూ మొదట వార్తలు వచ్చాయి. కానీ, పాండ్యకు జట్టులో చోటు దక్కింది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న భువి కూడా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ‘ఆటగాళ్లపై పడుతోన్న వర్క్‌లోడ్ ను దృష్టిలో పెట్టుకుని విరాట్‌ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చామని ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. గత కొద్ది కాలంగా అతడు విశ్రాంతి లేకుండా మూడు ఫార్మాట్లు ఆడుతున్నాడని అన్నారు.

కోహ్లీ విలువైన ఆటగాడు. భవిష్యత్తు టోర్నీలు కూడా దృస్టిలో పెట్టుకుని అతడికి విశ్రాంతి కల్పించాం’ అని సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ తెలిపారు. ఆసియా కప్‌లో భారత్‌ తన రెండో మ్యాచులో పాకిస్థాన్ తో తలపడనుంది. అసియా కప్ అడే భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, అంబటి రాయుడు, మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ(వికెట్‌ కీపర్‌), దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌, చాహల్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌, ఖలీల్‌ అహ్మద్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ambati rayudu  Asia Cup 2018  India  Kedhar Jadhav  Manish Pandey  rohit sharma  BCCI  cricket  

Other Articles