Rishabh Pant's duck off 29 balls puts in record book పంత్ ఖాతాలో పనికిరాని రికార్డు

Rishabh pant s duck off 29 balls puts in record books for unwanted reason

Rishabh Pant, India vs England, Suresh Raina, Irfan pathan, Pant duck, sports news,sports, latest sports news, cricket news, cricket

India vs England, 4th Test: After an impressive debut last week, Rishabh Pant recorded a duck off 29 balls on day 2, which is the joint-longest duck for India in Tests.

రిషబ్ పంత్ ఖాతాలో పనికిరాని రికార్డు

Posted: 09/01/2018 04:36 PM IST
Rishabh pant s duck off 29 balls puts in record books for unwanted reason

భారత యువ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్, క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి రిషబ్‌ పంత్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య గురువారం నాలుగో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో పంత్‌ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ బాట పట్టాడు.

47వ ఓవర్లో స్టోక్స్‌ వేసిన బౌలింగ్‌లో రహానె ఎల్బీడబ్ల్యూగా ఔటవ్వడంతో రిషబ్‌ పంత్‌ క్రీజులోకి వచ్చాడు. మరో ఎండ్‌లో ఉన్న పుజారాతో కలిసి పంత్‌ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ఈ క్రమంలో 29 బంతులాడిన పంత్‌ ఒక్క పరుగు కూడా చేయలేదు. 57వ ఓవర్లో మొయిన్‌ అలీ బౌలింగ్‌లో పంత్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో పంత్‌ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

29 బంతులాడి ఒక్క పరుగు కూడా చేయని బ్యాట్స్‌మెన్లు జాబితాలో పంత్‌ చోటు దక్కించుకున్నాడు. సురేశ్‌ రైనా, ఇర్ఫాన్‌ పఠాన్‌తో కలిసి సంయుక్తంగా ఈ జాబితాలో కొనసాగుతున్నాడు. 2014-15 సీజన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఓ టెస్టులో ఇర్ఫాన్‌ పఠాన్‌, 2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఓ టెస్టులో సురేశ్‌ రైనా ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్‌ బాటపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rishabh Pant  India vs England  Suresh Raina  Irfan pathan  Pant duck  cricket  sports  

Other Articles