Will Virat Kohli be a Sucessful Captain at Lord's.? లార్డ్స్ మైదానంలో విరాట్ సేనను విజయం వరించేనా.?

India vs england after kapil dev and ms dhoni virat kohli seeks win at lord s

india, england, ramlal nikhanj kapil dev, mahendra singh dhoni, virat kohli, england vs india 2018, england vs india, cricket, sports news, sports, latest sports news, cricket news, cricket

India are all set to face England in the second Test, starting August 9 at Lord's. Among 13 captains who have led India at Lord's, Kapil Dev and Mahendra Singh Dhoni have successfully led their teams to victories.

లార్డ్స్ మైదానంలో విరాట్ సేనను విజయం వరించేనా.?

Posted: 08/07/2018 03:44 PM IST
India vs england after kapil dev and ms dhoni virat kohli seeks win at lord s

ఇంగ్లాండ్ లో సుదర్ఘ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. టీ 20 సిరీస్ ను కైవసం చేసుకుని వన్డే సిరీస్ ను మాత్రం చేజార్చుకుంది. ఈ క్రమంలో ఐదు టెస్టులతో సిరీస్ ప్రారంభం కాగానే తొలి టెస్టులో విజయావకాశాలు మెండుగా వున్నా.. రెండో ఇన్నింగ్స్ లో వికెట్లను పారేసుకోవడంలో పోటీపడిన విరాట్ సేన.. ప్రస్తుతం ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో రెండో టెస్టుకు సన్నదం అవుతుంది. అయితే ఈ స్టేడియం భారత్ కు పెద్దగా అనుకూలించని స్టేడియం అని అక్కడి గణంకాలు చెబుతున్నాయి.

టీమిండియా క్రికెట్ జట్టు ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకూ భారత టెస్టు క్రికెట్‌ జట్టుకు సారథ్య బాధ్యతలు వహించిన 13 మందిలో ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో విజయాలను అందుకున్నారు. మొత్తంగా 17 మ్యాచులు లార్డ్స్ మైదానంలో అడగా ఇంగ్లాండ్ 11 మ్యాచులను గెలుచుకోగా, టీమిండియా కేవలం రెండు మాత్రమే గెలిచింది. కాగా నాలుగు మ్యాచులు డ్రా గా ముగిసాయి. దీంతో పరుగుల యంత్రంగా అభిమానులు పిలుచుకునే విరాట్ కోహ్లీ వంతు వచ్చేసరికి అభిమానులు అమితాసక్తిని కనబరుస్తున్నారు.

లార్డ్స్ లో  కెప్టెన్ విరాట్ కోహ్లీ విజయ సారధిగా నిలుస్తారా.? రెండు విజయాలను అందించిన కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనిల సరసన చోటు సంపాదిస్తాడా.? లార్స్ లో విరాట్ సేనను విజయం వరిస్తుందా.? లేదా.? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లార్డ్స్ మైదానంలో విజయం సాధించి ఆ ఘనత సాధించిన మూడో సారథిగా కోహ్లీ తన పేరును నమోదు చేసుకుంటాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే తొలి టెస్టును ఓడిన విరాట్ సేన ఒత్తడిలో వుందని.. దీంతో లార్డ్స్ లో రాణించడం కష్టమన్న వాదనలు కూడా వినబడుతున్నాయి.

లార్డ్స్ లో టీమిండియా టెస్ట్ రికార్డు:

మ్యాచ్లు: 17
టీమిండియా గెలిచినవి: 2
ఇంగ్లాండ్ గెలిచినవి: 11
డ్రా అయినవి: 4

1936: విజయనగరం మహారాజా (కెప్టెన్) - 9 వికెట్లతో ఓటమి
1946: పవడి సీనియర్ నవాబ్ (కెప్టెన్) - 10 వికెట్లు తేడాతో పరాజయం
1952: విజయ్ హజారే (కెప్టెన్) - 8 వికెట్ల తేడాతో ఓటమి
1959: పంకజ్ రాయ్ (కెప్టెన్) - 8 వికెట్ల తేడాతో ఓటమి
1967: MAK పటౌడీ (కెప్టెన్) - ఇన్నింగ్స్, 124 పరుగులతో పరాజయం
1971: అజిత్ వాడేకర్ (కెప్టెన్) - డ్రా
1974: అజిత్ వాడేకర్ (కెప్టెన్) - ఇన్నింగ్స్, 285 పరుగుల తేడాతో ఓటమి
1979: శ్రీనివాస్ వెంకటరాఘవన్ (కెప్టెన్) - డ్రా
1982: సునీల్ గవాస్కర్ (కెప్టెన్) - 7 వికెట్ల తేడాతో ఓడిపోయాడు
1986: కపిల్ దేవ్ (కెప్టెన్) - 5 వికెట్లు గెలుపొందాడు
1990: మొహమ్మద్ అజారుద్దీన్ (కెప్టెన్) - 247 పరుగుల తేడాతో ఓడిపోయాడు
1996: మొహమ్మద్ అజారుద్దీన్ (కెప్టెన్) - డ్రా
2002: సౌరవ్ గంగూలీ (కెప్టెన్) - 170 పరుగుల తేడాతో ఓడిపోయాడు
2007: రాహుల్ ద్రావిడ్ (కెప్టెన్) - డ్రాన్
2011: MS ధోనీ (కెప్టెన్) - 196 పరుగుల తేడాతో ఓడిపోయింది
2014: MS ధోనీ (కెప్టెన్) - 95 పరుగుల తేడాతో గెలిచారు
2018: విరాట్ కోహ్లీ (కెప్టెన్) - ???

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  england  kapil dev  ms dhoni  virat kohli  england vs india 2018  lords  cricket  

Other Articles

 • Ms dhoni run around chepauk as csk fan tries to catch him

  అభిమానిని ఆటపట్టించిన మిస్టర్ కూల్ ధోని

  Mar 19 | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 12వ సీజన్ కి అంతా సిద్ధమైంది. ఇప్పటికే ఆటగాళ్లు తమ హోం గ్రౌండ్ లు చేరుకొని ప్రాక్టీస్ ని ప్రారంభించారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ... Read more

 • Sourav ganguly backs ms dhoni to continue playing after 2019 world cup

  ఐసిసి ప్రపంచకప్ తరువాత ధోని ఆడోచ్చా..

  Mar 09 | ఐసీసీ ప్రపంచకప్ ప్రారంభం కాకముందే ఇప్పుడందరినీ మదిని తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే. మరీ ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అభిమానులను అందోళనకు, కలవరానికి గురిచేస్తున్న ప్రశ్న.. ప్రపంచకప్ టోర్నీ ముగియగానే ధోని... Read more

 • Kuldeep yadav says dhoni knows everything about a batsman opens up about tips during matches

  మ్యాచ్ లో ధోని ఇచ్చే సలహాలపై కుల్దీప్ ఏమన్నాడంటే..

  Mar 09 | భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీ ఇచ్చే టిప్స్ మ్యాచ్‌లో తనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో రాంచీ వేదికగా శుక్రవారం రాత్రి ముగిసిన మూడో వన్డేలో ఉస్మాన్... Read more

 • Chris gayle first player to smash 500 sixes in international cricket

  500 సిక్సర్లతో.. చరిత్ర సృష్టించిన క్రిస్ గేల్..

  Feb 28 | వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ మరోసారి రెచ్చిపోయి తన అంతర్జాతీయ క్రికెట్‌లో మైలురాయిని దాటేశాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న 5 వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన 4వ వన్డే మ్యాచ్‌లో పలు రికార్డులు... Read more

 • Time spent with dravid helped me a lot says kl rahul

  కెఎల్ రాహుల్ ను సానబట్టినది ఎవరో తెలుసా.?

  Feb 28 | సొంతగడ్డపై వెస్టిండీస్‌తో తలపడిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైయ్యాడు కేఎల్ రాహుల్. ఆస్ట్రేలియాతో ఆడిన 3 టెస్టుల్లో వరుస స్కోర్లు 2, 44, 2, 0, 9గా పూర్తి నిరాశపరిచాడు. దీంతో పూర్తిగా... Read more

Today on Telugu Wishesh