Harmanpreet Kaur Removed as DSP by Punjab Police డీఎస్పీ హోదా నుంచి కానిస్టేబుల్ స్థాయికి డిమోట్

Punjab withdraws harmanpreet s dsp rank over fake degree

Punjab Police, indian women’s twenty20 captain, harmanpreet’s dsp rank, Harmanpreet Kaur, Fake Degree, dsp rank, sports news,sports, latest sports news, cricket news, cricket

The Punjab government has withdrawn Harmanpreet Kaur's deputy superintendent of police rank, India women's T20 captain, after police verification found that her graduation degree was fake.

డీఎస్పీ హోదా నుంచి కానిస్టేబుల్ స్థాయికి డిమోట్

Posted: 07/10/2018 06:12 PM IST
Punjab withdraws harmanpreet s dsp rank over fake degree

దేశ రాజకీయాలలో నకిలీ డిగ్రీ సర్టిఫికేట్స్‌ ఓ వైపు ఇప్పటికీ తెగని సమస్యగా మారగా, అదే ఫేక్ సర్టిఫికేట్స్ వ్యవహారంలో చిక్కుకున్న ఓ క్రీడాకారిణికి మాత్రం పదవి కోల్పోయేలా చేసింది. అమె సమర్పించిన ధృవపత్రాలు నకిలీవని తేలడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అమెను డీఎస్సీ స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేసింది. ఇంతకీ అమె ఎవరంటారా.. భారత మహిళల టీ20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌..
ఆమెకు డీఎస్పీ హోదాని తొలగిస్తూ పంజాబ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

గత ఏడాది ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన మహిళల ప్రపంచకప్‌లో హర్మన్‌‌ప్రీత్ కౌర్ అద్భుత శతకంతో భారత జట్టుని ఫైనల్‌కి చేర్చింది. దీంతో.. ఆమెకి అప్పట్లో పంజాబ్ ప్రభుత్వం పోలీసు శాఖలో డీఎస్పీ జాబ్‌ని ఆఫర్ చేయగా.. ఈ ఏడాది మార్చి 1న ఈ క్రికెటర్ బాధ్యతలు స్వీకరించింది. కానీ.. ఆ సమయంలో సమర్పించిన డిగ్రీ సర్టిఫికేట్స్‌ నకిలీవని తాజాగా పంజాబ్‌ పోలీసులు తేల్చారు. 2011లో చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ నుంచి తాను డిగ్రీ పాసైనట్లు హర్మన్‌ప్రీత్‌ కౌర్ పోలీసు శాఖకి సర్టిఫికేట్స్‌ సమర్పించింది. కానీ.. విచారణలో అవి నకిలీవని తేలింది.

దీంతో.. ఇక నుంచి హర్మన్‌ప్రీత్‌ని 12వ తరగతి మాత్రమే పాసైనట్లుగా పంజాబ్ ప్రభుత్వం చూస్తుందని.. ఆమె అర్హతకి పోలీసు శాఖలోనే కానిస్టేబుల్‌ ఉద్యోగం (ఆమె ఒప్పుకుంటే) ఇవ్వనున్నట్లు ఓ అధికారి తెలిపారు. నకిలీ సర్టిఫికేట్స్‌ సమర్పించినప్పటికీ.. హర్మన్‌ప్రీత్ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన వివరించారు. హర్మన్‌ప్రీత్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే.. ఇప్పటికే ఆమె అందుకున్న అర్జున అవార్డుని కూడా కోల్పోవాల్సి వస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Icc t20i rankings kuldeep yadav rises to career best second india lose points

  ఐసిసి టీ-20 ర్యాకింగ్స్: రెండవ స్థానంలో కుల్దీప్ యాదవ్

  Feb 11 | ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లకు మంచి స్థానాలు దక్కాయి. బౌలింగ్‌ విభాగంలో చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ కెరీర్‌ బెస్ట్‌ రెండోస్థానంలో నిలిచాడు. మరోవైపు టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌... Read more

 • Imagine there is no ms dhoni icc recreates john lennon s classic

  ఎంఎస్ ధోనిపై మరోమారు ఐసీసీ ప్రశంసలు

  Feb 11 | టీమిండియా దిగ్గజం ధోనీపై మరోమారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తన అభిమానాన్ని చాటుకుంది.  ఈ మిస్టర్ కూల్.. వికెట్ కీపర్ పట్ల ధోనీకి ఐసీసీ కూడా వీరాభిమానిగా మారిపోయినట్లుంది. ఈ మధ్య ఐసీసీ చేసే... Read more

 • Parthiv patel won against yuvraj singh this week on instagram

  యువరాజ్ పై నెగ్గిన పార్థివ్ పటేల్.. ఎలాగో తెలుసా.?

  Feb 08 | టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్-కీపర్ పార్థివ్ పటేల్ ఆన్‌లైన్‌లో ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుని అభిమానులకు బోల్డంత విందు అందిస్తుంటారు. ఈ సెటైర్లలో చాలాసార్లు యువరాజ్‌దే పైచేయి అవుతూ ఉంటుంది. అయితే, ఈసారి... Read more

 • Rohit sharma breaks several records in auckland t20i

  రోహిత్ శర్మ రికార్డుల వేట.. సాగిందిలా..!

  Feb 08 | టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ టీ20ల్లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధ సెంచరీ (50) చేసిన రోహిత్... Read more

 • India vs new zealand 2nd t20i highlights india beat new zealand by 7 wickets

  రెండో టీ20లో టీమిండియా విజయం.. సిరీస్ 1-1తో సమం..

  Feb 08 | తొలి టీ20లో అత్యధిక పరుగుల తేడాతో పరాజయం పాలైన రోహిత్ సేన తాజాగా ఇవాళ జరిగిన రెండో టీ20లో కివీస్ పై ప్రతీకారం తీర్చుకుంది. న్యూజిలాండ్ పై 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన... Read more

Today on Telugu Wishesh