New Zealand women set odi world record, not england వన్డేల్లో అత్యధిక స్కోరు వారిదే తెలుసా..!

New zealand women set odi world record not england team with australia

Highest ODI Score,Trent Bridge,Nottingham,Jonny Bairstow,Eoin Morgan,England vs Australia,Alex Hales, Suzie Bates,New Zealand women's cricket team,maddy green,ireland,Amelia Kerr, cricket, cricket news, sports news, latest sports news, sports

Cricket world reacts to England's history-making demolition of Australia, but its New Zealand women cricket team which rewrites history by scoring 490 against ireland

వన్డేల్లో వరల్డ్ రికార్డ్ కుమ్ముడంటే వారిదే..!

Posted: 06/20/2018 03:32 PM IST
New zealand women set odi world record not england team with australia

ఇంగ్లండ్ వన్డే జట్టు మరోసారి దుమ్ముదులిపింది. తన రికార్డును తానే బద్దలు కొడుతూ వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డును నెలకొల్పింది. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన 50 ఓవర్ల మ్యాచ్‌లో 6 వికెట్ల నష్టానికి 481 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. 2016లో పాకిస్థాన్‌పై నెలకొల్పిన సొంత రికార్డును (444/3)ను తిరగరాసుకుంది. ఇంత వరకూ బాగానే ఉంది. ఈ విషయం కూడా ఇప్పటికే చాలా మందికి తెలిసింది. కానీ, ఇప్పటికీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పుడు ఇంగ్లండ్ సాధించిన 481 పరుగులు అత్యధిక స్కోరు కాదు.

అవును, వన్డే క్రికెట్‌లో అత్యధిక స్కోరు రికార్డు న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు పేరిట ఉంది. ఈ ఏడాది జూన్ 8న ఐర్లాండ్ మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ మహిళా జట్టు 4 వికెట్ల నష్టపోయి 490 పరుగులు సాధించింది. ఇదే ఇప్పటి వరకు వన్డేల్లో అత్యధిక స్కోరు. నిన్న జరిగిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సరిగ్గా 11 రోజుల ముందే న్యూజిలాండ్ మహిళా జట్టు ఈ రికార్డును నెలకొల్పింది. కాకపోతే ఈ విషయాన్ని చాలా మంది గుర్తించలేదు. మహిళా క్రికెట్‌కు అంత ప్రాధాన్యత లేకపోవడమే దీనికి కారణం.

అయితే మహిళా క్రికెటర్లకు తమ రికార్డులను పురుషుల జట్ల వల్ల తెరమరుగవ్వడం అలవాటైంది. అదెలా అంటే..
* వన్డేల్లో 200 పరుగులు చేసిన తొలి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కాదు.. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ బెలిండా క్లార్క్.
* వన్డేల్లో 400లకు పైగా పరుగులు చేసింది ఆస్ట్రేలియా కాదు. 1997లో న్యూజిలాండ్ మహిళా జట్టు పాక్ పై 455/5 పరుగులు చేసింది.
* శ్రీలంక జట్టు చేసిన 398/5 పరుగులే వన్డేలో హైయెస్ట్ స్కోర్.. కానీ ఏడాది తిరగకముందే న్యూజిలాండ్ మహిళలు ఈ రికార్డును తిరగరాశారు.
* మొట్టమొదటి క్రికెట్ వరల్డ్ కప్ 1975లో జరిగలేదు.. అంతకుముందే 1973లోనే మహిళా ప్రపంచకప్ ను నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : england  newzealand  ireland  australia  mens cricket  women's cricket  highest score  cricket  

Other Articles