we play our natural game in england: Prithvi Shaw ద్రావిడ్ మాకు స్వేఛ్ఛనిచ్చారు: పృథ్వీ షా

Dravid asked us to play our natural game in england prithvi shaw

team india, india a team, rahul dravid, prithvi shaw, natural game, liberty, england, cricket, cricket news, latest cricket news, sports news, sports

Prithvi Shaw is one of Indian cricket’s brightest young talents and he is in the middle of a purple patch. Shaw, currently on tour with the India A side in England.

ద్రావిడ్ మాకు స్వేఛ్ఛనిచ్చారు: పృథ్వీ షా

Posted: 06/18/2018 08:38 PM IST
Dravid asked us to play our natural game in england prithvi shaw

ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న భారత-ఎ జట్టు అద్బుతంగా రాణించడానికి కోచ్ రాహుల్ ద్రావిడ్ కారణమని జట్టు ఓపెనర్ పృథ్వీ షా వెల్లడించాడు. ఇంగ్లాండ్‌ క్రికెట్ బోర్డు ఎలెవన్‌తో తాజాగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచులో భారత-ఎ జట్టు 125 పరుగుల భారీ తేడాతో గెలుపొందడానికి కారణం తమకు స్వేచ్చనివ్వడమే కారణమని అన్నారు. తమను సోంత గేమ్ అడమని రాహుల్ ప్రోత్సహించడం వల్లే ప్రాక్టీసు మ్యాచులో తాము ఘనవిజయాన్ని అందుకున్నామని షా తెలిపారు.

ఈ గేమ్లో తాను (70: 61 బంతుల్లో 7x4, 3x6) అర్ధ శతకంతో జట్టుకి శుభారంభమివ్వగా.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (54: 45 బంతుల్లో 5x4, 1x6), ఇషాన్ కిషన్ (50: 46 బంతుల్లో 4x4, 2x6) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన తమ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరు సాధించిందని అన్నాడు. అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు దీపక్ చాహర్ (3/48), అక్షర్ పటేల్ (2/21) ధాటికి 203 పరుగులకే కుప్పకూలిపోయింది.

‘మ్యాచ్‌ల్లో అనుసరించాల్సిన టెక్నికల్‌ వ్యూహాల గురించి రాహుల్ ద్రవిడ్‌ సర్ జట్టుతో ఎక్కువగా చర్చించలేదు. కానీ.. మైదానంలో మానసిక దృఢంతో ఎలా ఉండాలో మాత్రం చెప్పారు. రాహుల్ సార్, పాంటింగ్‌ ఇద్దరూ అంతే.. జట్టులో ప్రతికూల ఆలోచనలు లేకుండా చూస్తారు. ఇంగ్లాండ్ పర్యటన‌ గురించి రాహుల్ ద్రవిడ్ సార్ ఒక్కటే చెప్పారు.. మీ సహజమైన ఆటను ఆడండని. ఇక్కడ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.. మెరుగైన ప్రదర్శనని కొనసాగించాలంటే జాగ్రత్తగా ఆడాల్సిందే’ అని పృథ్వీ షా వెల్లడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : team india  india a team  rahul dravid  prithvi shaw  natural game  liberty  england  cricket  

Other Articles