Rahane in no mood to show mercy to Afghanistan అప్ఘన్ తో అత్యుత్తమంగా రాణిస్తాం: రహానె

Ruthless india will not take afghanistan lightly ajinkya rahane

India vs Afghanistan, maiden test, Ajinkya Rahane, India v/s Afghanistan, Kuldeep Yadav, Virat Kohli, Ravichandran Ashwin, Ravindra Jadeja, Dinesh Karthik, bengaluru, chinnasamy stadium, ind vs afg, sports news,sports, latest sports news, cricket news, cricket

Afghanistan might be newcomers but Rahane emphasised on the need to be "ruthless" against a Test side even if it's making a debut on the big stage.

అప్ఘనిస్తాన్ తో అత్యుత్తమంగా రాణిస్తాం: అజింక్య రహానె

Posted: 06/13/2018 06:31 PM IST
Ruthless india will not take afghanistan lightly ajinkya rahane

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా.. టీమిండియాతో చారిత్రక తొలి టెస్టు ఆడబోతున్న అఫ్గానిస్థాన్‌ జట్టుపై తాము అత్యుత్తమంగా రాణించేందుకు జట్టుసభ్యులంతా సిద్దంగా వున్నారని భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె స్పష్టం చేశాడు. ఇటీవల టెస్టు హోదా దక్కించుకున్న అఫ్గానిస్థాన్‌ జట్టు టీమిండియాతో ఏకైక టెస్టు మ్యాచును ఆడనుంది. జూన్ 14న ప్రారంభం కానున్న ఈ టెస్టు లో తాము ప్రత్యర్థి జట్టును తేలిగ్గా తీసుకోవడం లేదని రహానె తెలిపాడు.

అఫ్గానిస్థాన్ జట్టు అటగాళ్లను గౌరవిస్తూనే.. నిర్ధాక్షిణ్యంగా ఆ జట్టుపై విరుచుకుపడతామని వివరించాడు. ఈ సందర్భంగా ఆయన బెంగుళూరులో మీడియాతో మాట్లాడుతూ.. తొలి టెస్టు అడుతున్నంత మాత్రాన వారిని తక్కువగా అంచనా వేయలేమని అన్నారు. అయితే వారి జట్టులో మెరుగైన స్పిన్నర్లు వున్నట్లుగానే తమ జట్టులో కూడా మంచి స్పిన్నర్లు వున్నారని చెప్పారు. వాళ్లది నాణ్యమైన జట్టు అని కితాబిచ్చారు. అయితే తమ జట్టులో కూడా అదిరిపోయే అటగాళ్లు వున్నారని చెప్పారు.

‘అఫ్గానిస్థాన్ జట్టుని మేము ఏమీ తేలిగ్గా తీసుకోవడం లేదు. వాళ్లది నాణ్యమైన జట్టు.. స్పిన్నర్లు కూడా మెరుగ్గా రాణిస్తున్నారు. ఒక టెస్టు జట్టుగా ప్రత్యర్థిని గౌరవిస్తూనే.. నిర్ణాక్షిణ్యంగా ఆడేందుకు ప్రయత్నిస్తాం. ప్రతి ఒక్కరూ తాము ఆడుతున్న జట్టే మెరుగ్గా ఉందని అనుకుంటుంటారు. కానీ.. గణాంకాలు అందరికీ తెలుసు. అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్ అనుభవం స్పిన్నర్లు. ఒక జట్టుగా మేము గణాంకాల్ని పట్టించుకోకుండా.. అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తాం’ అని రహానె వెల్లడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Afghanistan  maiden test  Ajinkya Rahane  bengaluru  chinnasamy stadium  ind vs afg  cricket  

Other Articles

 • Rashid khan asghar afghan and hasan ali fined 15 per cent of match

  అప్ఘన్-పాక్ మ్యాచులో రచ్చ.. 3 క్రికెటర్లకు ఫైన్..

  Sep 22 | ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌ కొత్త గొడవలకి తెరలేపింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఆధిపత్యం కోసం ప్రయత్నించగా.. హద్దులుమీరిన ముగ్గురు క్రికెటర్లకి జరిమానా కూడా పడింది. ఈ... Read more

 • Shoaib malik wins hearts for afghans consoling aftab alam after win

  అప్ఘన్ల హృదయాలను గెలుచుకున్న షోయబ్ మాలిక్

  Sep 22 | చివరి ఆరు బంతుల్లో పాక్ విజయానికి 10 పరుగులు అవసరమవగా.. క్రీజులో సీనియర్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ ఉండటంతో అఫ్గానిస్థాన్ కెప్టెన్ అస్గర్ బంతిని యువ బౌలర్ అప్తాబ్‌ అలామ్‌ చేతికిచ్చాడు. అయితే.. ఆ... Read more

 • Mithali raj sets record to captain most women odis

  చరిత్ర సృష్టించిన టీమిండియా మహిళా సారధి..

  Sep 12 | హైదరాబాదీ అమ్మాయి, భారతీయ మహిళా క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ మహిళా క్రికెటర్ గా రాణించి ఇప్పటికే పలు రికార్డులను అందుకున్న అమె తాజాగా అత్యధిక వన్డేలకు నాయకత్వం... Read more

 • Kl rahul rishabh pant heroics in vain as england win

  రాహుల్-పంత్ ల జోడీపై ప్రశంసల వెల్లువ

  Sep 12 | ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో అఖరిది, ఐదవదైన టెస్టు ముగిసినా అందులో విజయం సాధించడానికి టీమిండియా తరపున తుదివరకు పోరాటం చేసిన కేఎల్ రాహుల్- రిషబ్ పంత్ ల పోరాట పటిమపై... Read more

 • England v india alastair cook hits century in final test innings

  తుది టెస్టులో శతకంతో అలెస్టర్ కుక్ వీడ్కోలు..

  Sep 10 | టీమిండియాతో జరుగుతోన్న చివరి టెస్టు.. తన అఖరి టెస్టు కావడంతో తనదైన శైలిలో ట్రేడ్ మార్క్ శతకంతో ఇంగ్లాండ్‌ ఆటగాడు కుక్‌ శతకం విడ్కోలు పలికాడు. 70వ ఓవర్లో విహారి వేసిన తొలి బంతిని... Read more

Today on Telugu Wishesh