Sehwag takes a hilarious dig at Nigerian footballerఫుట్ బాల్ అటగాడిపై ట్వీటే కాదు.. వీడియో కూడా

Virender sehwag s hilarious take on leaves twitterati rofl ing

virender sehwag, funny videos, virender sehwag funny tweets, funny mother in law videos, funny family videos, funny romantic videos, Emmanuel Emenike, Iheoma Nnadi, Ezinne Akudo Anyaoha, Nigerian footballer, social media, viral news, entertainment

Virender Sehwag posted a small clip that shows a man giving pedicure to his wife when suddenly her “mother-in-law appears”. The way the romantic gesture swiftly turned into a damage control measure left people ROFL-ing.

ఫుట్ బాల్ అటగాడిపై ట్వీటే కాదు.. వీడియో కూడా

Posted: 06/01/2018 06:56 PM IST
Virender sehwag s hilarious take on leaves twitterati rofl ing

టీమిండియా డాషింగ్ ఓపెనర్ గా ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించిన మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌. రిటైర్మెంట్ తరువాత ప్రారంభించిన రెండో ఇన్నింగ్స్ లోనూ అదే దూకుడును కనబరుస్తున్నాడు. మాకు తెలుసు మీకు విషయం అర్థమైందని.. ఆయన చేపట్టిన రెండో ఇన్నింగ్స్ ట్వీటేగా అంటున్నారు కదూ. నిజమేనండి. అయితే తన ట్విట్లతో ఎప్పటికప్పుడు అన్ని విషయాలపై తనదైన స్టైల్లో షాట్లు కొడుతున్న వీరూ.. అభిమానులను అలరిస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  

ప్రస్తుతం వీరేంద్ర సెహ్వాగ్‌ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సెహ్వాగ్ ట్వీట్ తో పాటు ఒక వీడియో కూడా జత చేసి పోస్ట్ చేసాడు. ఈ ట్వీట్, వీడియో అభిమానులలో నవ్వులను పూయిస్తుంది. ఇప్పటికే నైజీరియన్ ఫుట్ బాల్ ప్లేయర్ అప్ డేట్ వర్షన్ తీసుకుంటున్నారంటూ అతని వివాహాం ఫోటోనూ పెట్టి ట్వీట్ చేసి.. ప్రతీ ఏడాది అప్ డేట్ చేసుకోవద్దని, ఇక తాము అప్ డేట్ 15ను చూడకూడదని భావిస్తున్నామని చెప్పాడు. ఇంతకీ ఈ అప్ డేట్ ఏంటంటారా..? నైజీరియన్ ఫుల్ బాల్ ప్లేయర్ ఇమాన్యుయేల్ తన భార్య మిస్ నైజీరియా 13కు విడాకులిచ్చి.. మిస్ నైజీరియా 14గా గెలుపొందిన యువతిని వివాహమాడాడు.

Unistall version 13, install version 14. Upgrading wife like phone. Emmanuel please don’t be annual. No version 15 please. pic.twitter.com/YHopoxLOlb

ఇక తాజాగా పోస్టు చేసిన వీడియో విషయానికొస్తే.. అనుకోకుండా అత్తగారు వస్తే ఏం చేయాలన్నది వీరూ.. వీడియో ద్వారా చూపాడు. ఈ వీడియోలో.. ఓ భర్త త‌న భార్య కాళ్లను చిన్న ప్లాస్టిక్ ట‌బ్‌లో పెట్టి కుడుగుతుంటాడు, ఇలా భార్యపై తాకున్న ప్రేమను చాటుకుండాడు. అదే స‌మ‌యంలో అత‌ని త‌ల్లి  అనుకోకుండా అక్క‌డ‌కు వ‌స్తుంది. ఇది గమనించిన వారు ఆమె వీరిని చూసేలోపే.. భార్య‌భ‌ర్త‌లు పొజిష‌న్స్ చేంజ్ చేసుకుంటారు. భ‌ర్త త‌ల‌ను భార్య కడుగుతున్న‌ట్టుగా నటిస్తారు. ఈ వీడియో చూసి మీరు కాసేపు సరదాగా నవ్వుకోండి. రిటర్మెంట్ అనంతరం సెహ్వాగ్ ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

 When your mother-in law suddenly appears pic.twitter.com/tLCdF29Nhf

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh