Ambati Rayudu's comical run-out అంబటి రాయుడు ఔటైన విధంబెట్టిదనినా.. చూడండీ..

Ambati rayudu hilarious mix up run out with dhoni

IPL 2018, Ambati Rayudu, MS Dhoni, Stephen Fleming, Dwayne Bravo, Indian Premier League 2018, Chennai Super Kings, Delhi Daredevils, Cricket news, sports news, sports, Cricket

Ambati Rayudu looked set for a big knock against Delhi Daredevils in an IPL 2018 match in Pune on Monday, but a hilarious mix-up with MS Dhoni resulted in the former being sent back to pavilion.

అంబటి రాయుడు ఔటైన విధంబెట్టిదనినా.. చూడండీ..

Posted: 05/01/2018 04:47 PM IST
Ambati rayudu hilarious mix up run out with dhoni

కావేరి నదీ జలాలా అంశంతో కాక మీద రగలిపోతున్న తమిళనాడు ప్రజాసంఘాల అగ్రహంతో పూణేకు తన వేదికను మార్చుకున్న చెన్నై జట్టు.. క్రితం రోజు రాత్రి జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై విజయకేతనం ఎగురవేసి మళ్లీ పాయింట్ల పట్టిన జాబితాలో నెంబర్ వన్ స్థానంలోకి ఎగబాకింది. అయితే చివరి వరకు తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్ ఏ కొంచెంలో చెన్నూ చేజారినా.. అంబటి రాయుడు రనౌట్ అయి విధానం తీవ్ర చర్చకు దారి తీసేది. అలా జరగకుండా చెన్నై మ్యాచ్ గెలిచింది కాబట్టి.. రాయుడు ఔట్ పెద్ద వార్తగా మారలేదు.

అయితే ఈ రనౌట్ విధానాన్ని పరిశీలిస్తే మాత్రం ఊరికే వికెట్ పారేసుకున్నట్లు అనిపిస్తుంది. ప్రత్యర్థి జట్టు అభిమానులకు నవ్వులు పూయించినా.. అంబటి కెప్టెన్ కాల్ వినకుండా ఇలా ఎలా పరుగెత్తాడా.? అన్న అనుమానాలు కూడా చర్చకు దారితీస్తున్నాయి. ఈ ఐపీఎల్ లో మంచి జోరుమీదున్న అంబటి రాయుడు మూడో వికెట్ కు కెప్టెన్ ధోని తో కలసి పరుగులు సాధిస్తున్న క్రమంలో ప్రత్యర్థి బౌలర్ విసిరిన ఓ బంతిని అడబోయిన క్రమంలో అది కాస్తా ఔటర్ ఎడ్జ్ కు తగిలి కీపర్ కు క్యాచ్ గా వెళ్లింది.

దీంతో బ్యాట్స్ మెన్ ధోని కీపర్ ను చూస్తూ వుండిపోగా, అటుగా వున్న అంబటి రాయుడు పరుగు తీసి ధోని వున్న వికెట్ల వైపుకు పరిగెత్తాడు. అయితే అప్పటికే నో అని అరిచిన ధోని కేకను కూడా లక్ష్యపెట్టకుండా పరుగు తీసిన రాయుడును చూసిన ధోని.. వెంటనే తన క్రీజ్ కు వెళ్లిపోమన్నాడు. దీంతో మళ్లీ పరుగు తీసిన రాయుడు.. క్రీజ్ లోకి చేరుకునే లోపునే ప్రత్యర్థి జట్టు ఫీల్డర్ బోల్ట్ బంతిని నేరుగా వికెట్లకు విసిరికోట్టి ఔట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 2018  Ambati Rayudu  MS Dhoni  Dwayne Bravo  Chennai Super Kings  Delhi Daredevils  Cricket  

Other Articles