MS Dhoni creates history, కెప్టెన్ గా ధోని.. మరో అరుదైన ఘనత..

Ms dhoni creates history becomes 1st indian captain to score 5000 t20 runs

MS Dhoni, Chennai Super Kings, IPL 2018, Indian Premier League, first Indian captain, 5000-run mark, Twenty20 cricket, Gautam Gambhir, Virat Kohli, cricket news, sports news, sports, cricket

Dhoni became the first Indian captain to breach the 5000-run mark in Twenty20 cricket. He currently leads the list with 5010 runs ahead of Gautam Gambhir (4242 runs) and Virat Kohli (3591 runs).

కెప్టెన్ గా ధోని.. మరో అరుదైన ఘనత..

Posted: 04/26/2018 06:48 PM IST
Ms dhoni creates history becomes 1st indian captain to score 5000 t20 runs

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఖాతాలో మరో అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో 34 బంతుల్లో ఒక ఫోర్, 7 సిక్సర్లు బాదిన ధోనీ 70 పరుగులు సాధించాడు. ఫలితంగా అతడి ఖాతాలోకి 5వేల పరుగులు వచ్చి చేరాయి. టీ20ల్లో 5వేల పరుగులు సాధించిన భారత తొలి కెప్టెన్‌గా ధోనీ రికార్డు సృష్టించాడు. 36 ఏళ్ల ధోనీ టీ20ల్లో మొత్తం 5,786 పరుగులు సాధించగా, అందులో 5,010 పరుగులు టీ20 కెప్టెన్‌గా చేసినవి కావడం గమనార్హం.

అయితే అది టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ గా చేసినవా లేక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా చేసినవా అన్న తేడా మాత్రం లేదు. ఇక కెప్టెన్ గా అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో ధోని తరువాత గౌతమ్ గంభీర్ 4242 పరుగులతో రెండో స్థానంలో వుండగా, విరాట్ కోహ్లీ 3591 పరుగులతో తృతీయ స్థానంలో కొనసాగుతున్నాడు. వీటితో పాటు నిన్నటి మ్యాచులో మరిన్నీ అరుదైన రికార్డులు కూడా నమోదయ్యాయి.
 
2012లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ చెన్నై జట్టు 206 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించింది. ఒక సీజన్‌లో 200 పరుగులకు పైగా విజయ లక్ష్యాన్ని ఛేదించిన రెండో జట్టుగా సీఎస్‌కే రికార్డులకెక్కింది. కోల్‌కతా‌తో జరిగిన మ్యాచ్‌లో 203 పరుగులను సాధించిన ధోనీ జట్టు తాజాగా 206 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. గతంలో డెక్కన్ చార్జర్స్ ఈ ఘనత సాధించింది. నిన్నటి మ్యాచ్‌లో రాయుడు-ధోనీ కలిసి 59 బంతుల్లో 101 పరుగులు సాధించారు. ఐదో వికెట్‌కు చెన్నై సెంచరీ భాగస్వామ్యం సాధించడం ఇదే తొలిసారి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  Chennai Super Kings  IPL 2018  Indian Premier League  5000 runs  indian captain  cricket  

Other Articles