RCB Captian Virat Kohli Fined Rs 12 Lakh ఆర్సీబి కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారీ జరిమానా.!

Ipl 2018 virat kohli fined rs 12 lakh for slow over rate

royal challengers bangalore, chennai super kings, virat kohli, slow over-rate, first offence, indian premier league 2018, Fine, cricket news, sports news, sports, cricket

Royal Challengers Bangalore captain Virat Kohli has been fined Rs 12 lakh for maintaining slow over-rate during his franchise's Indian Premier League (IPL) clash against Chennai Super Kings (CSK) at the M Chinnaswamy Stadium.

ఆర్సీబి కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారీ జరిమానా.!

Posted: 04/26/2018 06:04 PM IST
Ipl 2018 virat kohli fined rs 12 lakh for slow over rate

ఐపీఎల్ స్టార్ బ్యాట్స్ మెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఈ ఐపీఎల్ సీజన్ అస్సలు కలసిరావడం లేదు. మరీ ముఖ్యంగా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎంత శ్రమించినా ఫలితం మాత్రం దక్కడం లేదు. అత‌ని జ‌ట్టు గెల‌వాల్సిన మ్యాచులు కూడా ఓడిపోతున్నాడు. రెండు వంద‌ల పరుగుల పైచిలుకు ప‌రుగులు చేసినా ఓట‌మి చ‌విచూడాల్సి రావ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మే. నిన్న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో విజయం రాయల్స్ వైపునే వుందని అందరూ అంచనాలు వేసినా.. రాయుడు, ధోనీల వీరవిహారంతో మ్యాచ్ గతి తిరిగింది.

క్రితం రోజు చెన్నైతో జ‌రిగిన మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు రాయల్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులు సాధించి చెన్నై సూపర్ కింగ్స్ ఎధుట 206 పరుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. ఓ ద‌శ‌లో చైన్నై జ‌ట్టు 74 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఆ ద‌శ‌లో ధోనీ, రాయుడు పరుగుల సునామీని సృష్టించారు. అటు ధోని, ఇటు రాయుడు ఇద్దరూ అర్థశతకాలను సాధించి.. సిక్సర్లు, ఫోర్లతో చెల‌రేగి ఆడారు. దీంతో బెంగ‌ళూరుపై చెన్నై మరో రెండు బంతులు మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది.
 
దీంతో ఎంత భారీ స్కోరు సాధించినా కాపాడుకోలేకపోయామని విరాట్ కోహ్లీ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇక మరోవైపు ఈ మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగా కోహ్లీపై భారీ జ‌రిమానా ప‌డింది. `స్లోఓవ‌ర్‌రేట్ కార‌ణంగా ఆర్సీబీ జ‌ట్టు కెప్టెన్ కోహ్లీకి 12 ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమానా విధిస్తున్నాం. ఇలా చేయ‌డం ఈ జ‌ట్టుకు ఇదే తొలిసారి` అని ఐపీఎల్ మేనేజ్‌మెంట్ ఓ లేఖ విడుద‌ల చేసింది. కాగా, ఈ ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఆరు మ్యాచ్‌లు ఆడిన బెంగ‌ళూరు జ‌ట్టు కేవ‌లం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజ‌యం సాధించి పాయింట్ల పట్టిక‌లో ఆరోస్థానంలో నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Captain Virat Kohli  Royal Challengers Bangalore  slow over-rate  Fine  sports  cricket  

Other Articles