ICC World Cup 2019 schedule changed due to IPL వరల్డ్ కప్ 2019లో స్వల్ప మార్పులు.. తొలి మ్యాచ్ సఫారీలతోనే

2019 icc world cup india to open campaign versus south africa

world cup 2019, India vs South Africa, justice lodha comittee, icc ceo meet, Team India, durban, cape town, South Africa vs India 2019 worldcup match, virat kohli, Ajinkya Rahane, rahane, India v/s South Africa, Ind vs SA, MS Dhoni, cape town, chahal, Hardik Pandya, sports news,sports, latest sports news, cricket news, cricket

The Indian cricket team will play its first match of the 2019 ICC Cricket World Cup against South Africa on June 5 instead of June 2 as the BCCI will have to maintain a mandatory 15-day gap between IPL final and international assignment as per the Lodha Committee recommendation.

వరల్డ్ కప్ 2019లో స్వల్ప మార్పులు.. తొలి మ్యాచ్ సఫారీలతోనే

Posted: 04/24/2018 05:59 PM IST
2019 icc world cup india to open campaign versus south africa

2019 వరల్డ్ కప్‌ కు సంబంధించి షెడ్యూల్ లో స్వల్ప మార్పులు జరిగాయి. అయితే మార్పులు నేపథ్యంలో టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య జరగాల్సిన మ్యాచ్ లు జూన్ 2కు బదులు జూన్ 5న జరగనుంది. ఇండియా తమ ఫస్ట్ మ్యాచ్‌ లో సౌతాఫ్రికాతో జూన్ 2న తలపడాల్సి వుంది. అయితే జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల మేరకు ఈ సవరణలు చేశారు. ఈ సిఫార్సుల ప్రకారం ఐపీఎల్ ఫైనల్  మ్యాచ్ కు, అంతర్జాతీయ మ్యాచ్‌ కు మధ్య కనీసం 15 రోజుల సమయం కచ్చితంగా ఉండాలని స్పష్టంగా వుంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ కమిటీ సీఈవోల మీటింగ్లో దీనిపై చర్చించి సవరణలు చేశారు.

2019 వరల్డ్‌ కప్ మే 30 నుంచి జులై 14 వరకు ఇంగ్లండ్‌ లో జరగనున్న విషయం పాఠకులకు తెలిసింది. వరల్డ్ కప్ నేపథ్యంలో రానున్న ఏడాది ఐపీఎల్ సీజన్ 12 మ్యాచులు కూడా మార్చి నుంచే ప్రారంభించనున్నారు. మార్చి 29 నుంచి మే 19 వరకు జరగనుంది. దీంతో 15 రోజుల నిబంధన మేరకు జూన్ 5నే ఫస్ట్ మ్యాచ్ ఆడే వీలుంది బిసిసిఐ అధికారి చెప్పారు. సౌతాఫ్రికాతో ఇండియా ఫస్ట్ మ్యాచ్ ఉంటుంది. షెడ్యూల్‌ లో మార్పుకు CEC అంగీకరించింది. దీనిని ఐసిసి బోర్డుకు సిఫారసు చేశామని అధికారి వెల్లడించారు.

నిజానికి గతంలో ఇండియా, పాకిస్థాన్‌ తోనే పెద్ద పెద్ద ఈవెంట్‌ లను ఐసీసీ ప్రారంభించేది. 2015 వరల్డ్‌ కప్, 2017 చాంపియన్స్ ట్రోఫీ ఇలాగే ప్రారంభమైంది. అయితే ఈసారి మాత్రం ఇండో-పాక్ మ్యాచ్ ఉండటం లేదు. ఈసారి టోర్నీ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరగనుంది అని ఆ అధికారి చెప్పారు. రౌండ్ రాబిన్ అంటే 1992 వరల్డ్‌ కప్‌ లో మాదిరిగా ఒక టీమ్ మిగతా అన్ని టీమ్స్‌ తో ఆడాల్సి ఉంటుంది. 2019-23 మధ్య ఐదేళ్ల కాలానికి ఎఫ్ టీ పీ ని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ కాలంలో టీమిండియా మొత్తం 309 రోజుల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది. అయితే టెస్ట్ మ్యాచ్‌ ల సంఖ్య 15 నుంచి 19కి పెరిగింది. ఇవన్నీ టెస్ట్ చాంపియన్‌ షిప్‌ లో భాగంగా జరిగేవే. డేనైట్ టెస్ట్ మ్యాచ్ మాత్రం ఇండియా ఇప్పట్లో ఆడబోవడం లేదు. టెస్ట్ చాంపియన్‌ షిప్‌ లో అన్ని మ్యాచ్‌ లూ డే మ్యాచ్‌లే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles