We Read the Pitch Wrong, Says Virat Kohli సొంత స్టేడియంలోని పిచ్ ను అంచనా వేయలేకపోయాం: విరాట్ కోహ్లీ

We read the pitch wrong virat kohli admits after defeat

virat kohli,Rajasthan Royals,IPL 2018,Royal Challengers Bangalore,IPL 11,Chris Woakes

Royal Challengers Bangalore captain Virat Kohli admitted to having misread the Chinnaswamy track that turned out to be a batsman's paradise rather than being a slow turner

సొంత స్టేడియంలోని పిచ్ ను అంచనా వేయలేకపోయాం: విరాట్ కోహ్లీ

Posted: 04/16/2018 07:28 PM IST
We read the pitch wrong virat kohli admits after defeat

రాజస్థాన్‌ రాయల్స్ తో జరిగిన మ్యాచులో తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలోని పిచ్ స్వభావాన్ని తాము సరిగ్గా అర్థం చేసుకోలేకపోయామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన చేసిన రహానె బృందం 217 పరుగులు చేయగా ఛేదనకు దిగిన కోహ్లీసేన 198 చేసింది. వికెట్ ను తాము స్లోగా ఉంటుందని అంచనా వేసినట్టు విరాట్ కోహ్లీ పేర్కోన్నాడు. అయితే తొలి ఇన్నింగ్స్ లో బంతి చక్కగా బ్యాటుపైకి రావడంతో అశ్చర్యపోయామని అన్నాడు. దీంతోనే రాజస్థాన్ రాయల్స్ 200 పరుగులు సాధించిందని అభిప్రాయపడ్డారు.

అయితే టీ20 క్రికెట్ లో ఇలాంటివి సర్వసాధారణమని అభిప్రాయపడ్డ కోహ్లీ.. ఇందుకు తమ జట్టు బౌలర్లను తప్పుపట్టాల్సిందేమీ లేదని అన్నాడు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుందని తెలిపాడు. వికెట్ పై 400 పరుగులు పారించారంటే బౌలర్లపై ఒత్తిడి అర్థం చేసుకోవచ్చు. జట్టుకు సమతూకం తేవాలని, మరొక బౌలింగ్‌ వనరు అందుబాటులో ఉంటుందని సర్ఫరాజ్ ను కాదని పవన్‌ నేగిని ఎంచుకున్నామని చెప్పాడు. చివర్లో మన్‌దీప్‌ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుతంగా ఆడటం మాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా లోయర్‌ ఆర్డర్‌ ఆదుకోగలదన్న నమ్మకం కలిగిందని విరాట్ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  Rajasthan Royals  IPL 2018  Royal Challengers Bangalore  IPL 11  Chris Woakes  

Other Articles

 • Mithali raj sets record to captain most women odis

  చరిత్ర సృష్టించిన టీమిండియా మహిళా సారధి..

  Sep 12 | హైదరాబాదీ అమ్మాయి, భారతీయ మహిళా క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ మహిళా క్రికెటర్ గా రాణించి ఇప్పటికే పలు రికార్డులను అందుకున్న అమె తాజాగా అత్యధిక వన్డేలకు నాయకత్వం... Read more

 • Kl rahul rishabh pant heroics in vain as england win

  రాహుల్-పంత్ ల జోడీపై ప్రశంసల వెల్లువ

  Sep 12 | ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో అఖరిది, ఐదవదైన టెస్టు ముగిసినా అందులో విజయం సాధించడానికి టీమిండియా తరపున తుదివరకు పోరాటం చేసిన కేఎల్ రాహుల్- రిషబ్ పంత్ ల పోరాట పటిమపై... Read more

 • England v india alastair cook hits century in final test innings

  తుది టెస్టులో శతకంతో అలెస్టర్ కుక్ వీడ్కోలు..

  Sep 10 | టీమిండియాతో జరుగుతోన్న చివరి టెస్టు.. తన అఖరి టెస్టు కావడంతో తనదైన శైలిలో ట్రేడ్ మార్క్ శతకంతో ఇంగ్లాండ్‌ ఆటగాడు కుక్‌ శతకం విడ్కోలు పలికాడు. 70వ ఓవర్లో విహారి వేసిన తొలి బంతిని... Read more

 • Michael vaughan mocks virat kohli says he s the worst reviewer in the world

  కోహ్లీని.. మైకిల్ వాన్ అంతమాట అంటారా.?

  Sep 10 | టీమిండియా రన్ మెషీన్ విరాట్‌ కోహ్లీపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు. ఓ వైపు కోహ్లీని ప్రశంసిస్తూనే.. అయనపై విమర్శలు కూడా చేశారు. విరాట్ కోహ్లీని ఏకంగా... Read more

 • No place for tendulkar dravid or any other indian in alastair cook s dream xi

  కుక్ డ్రీమ్ టీమ్ లో భారతీయులకు నో ఛాన్స్

  Sep 05 | ఇంగ్లాండ్‌ మాజీ సారథి అలిస్టర్‌ కుక్‌ ఇటీవలే తన రిటైర్ మెంట్ ప్రకటించాడు. దీంతో తన చివరి టెస్టును అడుతున్న ఆయన తన ఆల్ టైమ్‌ ఎలెవన్‌ జట్టును ప్రకటించాడు. తన 11 మంది... Read more

Today on Telugu Wishesh