Balanced perspective needed in condemnation: Steve Waugh బాల్ ట్యాంపరింగ్ పై స్టీవ్ వా స్పందనిదే..

Steve waugh deeply troubled by ball tampering controversy

Steve Smith, S. Smith, David Warner, D. Warner, Steve Waugh, Steve Smith ban, David Warner ban, Ball tampering, Ball tampering scandal, Ball tampering row, Cameron Bancroft, South Africa vs Australia, Australian government, Steve Smith captain, SA vs Aus, Malcolm Turnbull,james sutherland, Australia, ICC, cricket, cricket news, sports news, sports

Former Australian captain Steve Waugh was 'deeply troubled' by the ball-tampering row that has engulfed Steve Smith and David Warner.

బాల్ ట్యాంపరింగ్ పై స్టీవ్ వా.. దేశ క్రీడాసంస్కృతికి విఘాతం..

Posted: 03/27/2018 05:29 PM IST
Steve waugh deeply troubled by ball tampering controversy

ఎవరితో మ్యాచ్ జరుగుతున్నా.. ప్రత్యర్థి జట్టు ఎవరైనా.. తమ గురి కేవలం విజయవైపు మాత్రమే ఉంటుందని.. దానిని అందుకునేందుకు ఎంతటి కష్టానికైనా తామ జట్టు సభ్యులు సిద్దంగా వుంటారని.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచు చేజారనీయడం ఇష్టముండని తమ దేశ జట్టుకు ఇష్టముండదని ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు మాజీ క్రికెటర్ స్టీవ్ వా. అయితే గత కొద్ది రోజులుగా అసీస్ జట్టు ప్రతిష్టను మసకబార్చే విధంగా చేశారన్న వార్తలు తనను భాధించాయని అన్నారు. బాల్‌ టాంపరింగ్‌ లాంటి చర్యలకు పాల్పడి మాత్రం ఎప్పుడూ గెలవాలనుకోలేదని ఆయన అన్నారు.

తమ జట్టులో పోరాటపటిమ, నైపుణ్యంతో.. విజయాన్ని అందుకోవాలని మాత్రమే అలోచిస్తుందని, కానీ ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో కూడా ఇలాంటి సంస్కృతి లోపించినట్లుగా వార్తలు రావడం.. జట్టు మొత్తం ప్రయోజనాలను దెబ్బతీయడమేనని అయన అవేధన వ్యక్తం చేశారు. తాజా బాల్‌టాంపరింగ్‌ వివాదం గురించి ఆయన మాట్లాడుతూ.. 2003లో మెల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌ రూపొందించిన ‘స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌’ అనే డాక్యుమెంట్లలో మార్పులు చేశామన్నారు. ఇలా చేయడం వల్ల ఆటగాళ్లు మరింత స్వేచ్ఛగా ఆడతారని భావించామని కానీ అదే వాళ్లను తప్పలు చేసేందుకు ప్రేరణ కల్పిస్తుందని భావించలేదని అన్నారు.

ప్రస్తుతం జరిగిన పరిణామాలను పరిగణలోకి తీసుకుని డాక్యుమెంట్ ను మరోసారి ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని స్టీవ్ వా అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా, క్రికెట్‌ ప్రతిష్ఠ దెబ్బతినకుండా, క్రికెట్‌ కెరీర్ గా, స్ఫూర్తిగా, శ్వాసగా భావించే అభిమానులను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేయాల్సి వుందని సూచించాడు. బాల్‌ టాంపిరింగ్‌ పాల్పడిన ఘటన తనను ఎంతగానో కలచివేసిందని అవేదన వ్యక్తం చేశాడు. దీనిని ప్రశ్నిస్తూ తన అభిమానులు ఎన్నో వేల మెసేజ్ లు పంపారు. వారు ఎంత బాధపడుతూ ఆ మెసేజ్ లు చేశారో వాటిని చదివితే అర్ధమైందని స్టీవ్‌ వా పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles