Dhoni, Raina, Bravo return to CSK fortress ఐపీఎల్ కోసం ఇప్పట్నించే చెమటోడుస్తున్న చెన్నై

Dhoni raina bravo return to chennai super kings fortress

ms dhoni, dhoni, chennai super kings, csk, ipl 2018, ipl, indian premier league, ms dhoni photos, csk photos, ipl photos,, Cricket news, sports news, sports, latest sports updates, cricket

MS Dhoni and his men at Chennai Super Kings are raring for the IPL 2018. CSK are ready to return to IPL action after a gap of two years. While the team worked hard to got back into the groove in training, they are also busy having loads of fun off the field.

ఐపీఎల్ కోసం ఇప్పట్నించే చెమటోడుస్తున్న సీఎస్కే

Posted: 03/23/2018 07:21 PM IST
Dhoni raina bravo return to chennai super kings fortress

కాసుల వర్షం కురిపించే దేశీయ క్రీకెట్ లీగ్ గా పేర్కోందడంతో పాటు అభిమానుల నెలన్నర రోజుల పాటు కన్నుల పండవగా సాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్.. మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా జట్ల అటగాళ్లందరూ.. తాము ప్రాతినిధ్యం వహించే జట్లతో చేరిపోయి ప్రాక్టీసు చేస్తున్నారు. కొత్త జెర్సీలతో ఫొటో షూట్లు, ప్రాక్టీస్‌లతో సందడిగా గడుపుతున్నారు.

రెండేళ్ల నిషేధం ముగించుకుని ఈ ఏడాది తిరిగి ఐపీఎల్‌ లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్‌కింగ్స్‌. రాజస్థాన్ జట్లు కూడా తమ అమ అటగాళ్ల ప్రాక్టీసు కోసం అన్ని ఏర్పాటు చేశాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ లో ఉన్న క్రేజ్‌ అంతాఇంతా అని చెప్పలేం. మునుపటి మాదిరిగానే ధోనీ నాయకత్వంలోనే చెన్నై బరిలో దిగుతోంది. అంతేకాదు ధోనితో పాటుగా సురేష్ రైనా కూడా చెన్నై జట్టు తరపునే అడుతున్నాడు.

తాజాగా వీరు బ్యాటింగ్‌ చేస్తున్న వీడియోలను చెన్నై సూపర్‌ కింగ్స్‌ ట్విటర్‌ ద్వారా పంచుకుంది. ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా చెన్నై జట్టు గత రెండేళ్లు నిషేధానికి గురైంది. ఆ సమయంలో ధోనీ రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కాగా. ఈ ఏడాది జనవరి 4న నిర్వహించిన ప్లేయర్‌ రిటెన్షన్‌లో చెన్నై ధోనీ,జడేజా, రైనాలను తమ జట్టులోనే కొనసాగుతారని తెలిపింది. ఈ ఏడాది చెన్నై తన తొలి మ్యాచులో డిఫెండింగ్‌ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ తో తలపడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian premier league  Chennai Super Kings  CSK  IPL 2018  Cricket  

Other Articles