Washington's spell up front was magical, says Rohit సుందర్ పై రోహిత్ ప్రశంసలు..

Washington s spell up front was magical says rohit sharma

India vs Bangladesh, Washington Sundar, Suresh Raina, Rohit Sharma, Premadasa stadium, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

India skipper Rohit Sharma heaped praises on off-spinner Washington Sundar for starring with the ball during the 17-run win over Bangladesh at the R Premadasa Stadium

సుందర్ స్పీన్ మాయాజలంతోనే నల్లేరుపై నడక..

Posted: 03/15/2018 05:18 PM IST
Washington s spell up front was magical says rohit sharma

టీమిండియా యువ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్ పై తాత్కాలిక కెప్టెన్ రోహిత్‌ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ 20 ముక్కోణపు టోర్నీలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచులో వాషింగ్టన్ సుందర్ తన స్పీన్ తో మాయ చేశాడని అన్నాడు.  ఈ మ్యాచులో సుందర్ 22 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన నేపథ్యంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. బంగ్లాపై నిన్న జరిగిన మ్యాచు విజయంలో జట్టు సమిష్టి కృషి వున్నప్పటికీ.. వాషింగ్టన్ సుందర్ మాయజాలం పూర్తిగా మ్యాచ్ గతిని మార్చేసిందని రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించారు.

వాషింగ్టన్‌ సుందర్‌ స్పిన్ తో మాయ చేసి టీమిండియాకు విజయాన్ని అందించాడని.. కొత్త బంతితో స్పిన్నర్ల బౌలింగ్ చేయడం సులువైన విషయం కాదని, కానీ, సుందర్ కొత్త బంతితో రాణించి బంగ్లా స్కోరును కట్టడి చేయడంలో పైచేయి సాధించాడని అన్నాడు. అతనికి బౌలింగ్ కు పిలిచే ముందు తాను కొంత ఆందోళన గురయ్యానని, అయితే తన వ్యూహాలను సరిగ్గా అమలు చేసిన సుందర్ ప్రణాళికబద్దంగా బంతులు విసిరి.. విజయం సాధించాడు. ఫీల్డింగ్‌ ఎలా సెట్ చేసుకోవాలో బౌలర్లకు తెలుసని.. ఆ విషయంలో కూడా సుందర్ బాగా రాణించాడని రోహిత్ అన్నాడు.

శ్రీలంకతో జరిగిన మ్యాచుల్లోనూ అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సుందర్ తో పాటు మిగతా బౌలర్లు కూడా తమ ప్రణాళికలను బాగా అమలు చేశారని రోహిత్ అన్నాడు. ‘ఈ పిచ్ పై త్వరగా పరుగులు చేయడం సాధ్యం కాదని.. అందుకే మైదానంలో కాస్త నిలదొక్కుకున్న తర్వాత పరుగులు రాబట్టాలనుకుని అలానే చేశానని చెప్పాడు. ఈ మ్యాచులో అత్యధిక పరుగులు సాధించి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ సొంతం చేసుకున్నాడు రోహిత్‌ శర్మ. ఈ మ్యాచులో గెలిచిన టీమిండియా ఫైనల్ కు చేరుకున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Bangladesh  Washington Sundar  Suresh Raina  Rohit Sharma  Premadasa stadium  cricket  

Other Articles