Dannielle to use Kohli's bat during England tour of India అభిమాన క్రికెటర్ ఇచ్చిన బ్యాటుతోనే ట్రై సీరీస్ కు..

Dannielle wyatt to use virat kohli s bat during england tour of india

virat kohli, kohli danni wyatt, danni wyatt, kohli anushka, india vs england, england women's cricket team, cricket, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Danni Wyatt is in India, a country where she is very popular because of a tweet. Back in 2014, the England cricketer had proposed to current Indian cricket team captain Virat Kohli on Twitter. Now, she is here with the England women’s cricket team as they play a T20I Tri-Series including India and Australia.

అభిమాన క్రికెటర్ ఇచ్చిన బ్యాటుతోనే ట్రై సీరీస్ కు..

Posted: 03/13/2018 08:41 PM IST
Dannielle wyatt to use virat kohli s bat during england tour of india

భారత పరుగుల యంత్రం, కెప్టన్ విరాట్ కోహ్లీకి బహిరంగంగా లవ్ ప్రమోజ్ చేసి.. తనను పెళ్లి చేసుకోవాలని అగిడిన మహిళా క్రికెటర్ గుర్తుందా..? ఎవరామె..? అంటారా.. అమె ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ డేనియెల్లి వాట్‌. త్వరలో ముక్కోణపు టీ20 సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌ జట్టు భారత్ లో పర్యటించనున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు తరపున డేనియెల్లి కూడా భారత్ కు వస్తుంది. అయితే ఏంటీ..? అంటారా..? విరాట్ కోహ్లీకి పెళ్లైన విషయం తెలిసినా దానిని అంతూ ఔనత్యంతో స్వాగతించిన డేనియెల్లి.. తనకు విరాట్ పైనున్న అభిమానాన్ని మాత్రం ఏవరూ తుడిచేయలేరని చెప్పకనే చెబుతుంది.

అదెలా అంటే.. త్వరలో భారత్ లో ముక్కోణపు సిరీస్ లో భాగంగా పర్యటించేందుకు వస్తున్న తాను.. విరాట్ కోహ్లీ ఇచ్చిన బ్యాటుతోనే ముక్కోణపు సిరీస్ అడతానని ప్రకటించింది. నిజంగానే విరాట్ కోహ్లీ అమెకు బ్యాటును బహుకరించాడా..? అంటే అవును. 2014లో టీమిండియా ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లినప్పుడు..  డెర్బిషైర్ లో భారత ‌-ఇంగ్లాండ మధ్య జరిగిన వార్మప్‌ మ్యాచుకు డేనియల్లీ వచ్చింది. మ్యాచ్‌ అనంతరం కోహ్లీని కలిసింది. దీంతో ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ గా అమెను గౌరవ మర్యాదలతో అహ్వానించిన విరాట్ అమె కోరిక మేరకు ఫొటో కూడా దిగాడు. ఆమెను కలిసిన సందర్భంగా అమెకు తన వద్దనున్న ఒక బ్యాటును కూడా కానుకగా బహుకరించాడు.

అప్పట్లో కోహ్లీతో దిగిన ఫొటోను, బ్యాట్ ను సోషల్ మీడియాలో పెట్టిన డేనియెల్లి అప్పట్లో తెగ సంబరపడిపోయింది. ఇక తాజాగా ముక్కోణపు సిరీస్‌ కోసం భారత్‌ వస్తున్న నేపథ్యంలో తాను కోహ్లీ బహుకరించిన బ్యాటుతోనే అడతానని చెప్పింది. అదేంటి అని మీడియా ప్రశ్నించగా, తాను అడే బ్యాట్ విరిగిపోయిందని, దీంతో తాను విరాట్ ఇచ్చిన బ్యాట్ తోనే అడతానని తెలిపింది. భారత్‌-ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా మధ్య ముక్కోణపు టీ20 సిరీస్‌ మార్చి 23 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఆ తర్వాత మార్చి 25న భారత్‌.. ఇంగ్లాండ్ తో తలపడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Dhoni s wife sakshi applies for arms licence citing threat to life

  భర్త అడుగుజాడల్లో పయనిస్తున్న సాక్షిధోని

  Jun 20 | టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి ఆయన బాటలోనే పయనిస్తున్నారు. గతంలో తుపాకీ లైన్సెన్సు పోందిన దోని మాదిరిగానే ఆయన భార్య సాక్షి కూడా గన్ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకున్నారు.... Read more

 • New zealand women set odi world record not england team with australia

  వన్డేల్లో వరల్డ్ రికార్డ్ కుమ్ముడంటే వారిదే..!

  Jun 20 | ఇంగ్లండ్ వన్డే జట్టు మరోసారి దుమ్ముదులిపింది. తన రికార్డును తానే బద్దలు కొడుతూ వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డును నెలకొల్పింది. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన 50 ఓవర్ల మ్యాచ్‌లో 6 వికెట్ల నష్టానికి 481... Read more

 • Sri lanka skipper dinesh chandimal gets ball tampering ban

  చండీమల్ పై వేటు.. మూడో టెస్టుకు దూరం..

  Jun 20 | బ్యాల్ ట్యాపరింగ్ విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తాను చేయని నేరానికి తనను బలి చేస్తున్నారని చెబుతూ వచ్చిన శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండీమల్ ఎట్టకేలకు నేరాన్ని అంగీకరించడంతో.. అతనిపై ఐసీసీ వేటు... Read more

 • Dravid asked us to play our natural game in england prithvi shaw

  ద్రావిడ్ మాకు స్వేఛ్ఛనిచ్చారు: పృథ్వీ షా

  Jun 18 | ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న భారత-ఎ జట్టు అద్బుతంగా రాణించడానికి కోచ్ రాహుల్ ద్రావిడ్ కారణమని జట్టు ఓపెనర్ పృథ్వీ షా వెల్లడించాడు. ఇంగ్లాండ్‌ క్రికెట్ బోర్డు ఎలెవన్‌తో తాజాగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచులో భారత-ఎ... Read more

 • Ms dhoni takes rigorous net session at ncacademy ahead of england tour

  ఇంగ్లాండ్ టూర్ కోసం కఠినంగా శ్రమిస్తున్న ధోనీ..!

  Jun 18 | భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నెట్స్‌లో కఠినంగా శ్రమిస్తున్నాడు. ఈనెల 27, 29న ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌ ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటన ఉండటంతో.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ధోనీ... Read more

Today on Telugu Wishesh