KL Rahul first Indian to be dismissed hit-wicket in T20Is తొలి భారత క్రికెటర్ గా రాహుల్ చెత్త రికార్డు..

Kl rahul first indian to be dismissed hit wicket in t20is

india vs sri lanka, ind vs sl, india vs sri lanka 1st t20i, kl rahul, kl rahul hit wicket, cricket, cricket news, sports news, latest sports news, sports

India batsman KL Rahul, came down to the middle after the dismissal of Rohit Sharma and went on to score 18 runs in 17 balls with the help of a boundary. The Karnataka batsman, though was unlucky as he failed to cap off to a good start, following an unusual dismissal.

తొలి భారత క్రికెటర్ గా రాహుల్ చెత్త రికార్డు..

Posted: 03/13/2018 06:15 PM IST
Kl rahul first indian to be dismissed hit wicket in t20is

టీ20 మ్యాచుల్లో భారత క్రికెటర్లు ఎవరూ ఇప్పటి వరకు నమోదు చేసుకోని చెత్త రికార్డును కేఎల్ రాహుల్ తన పేరున రాసుకున్నాడు. ట్రై సీరీస్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచు లో హిట్‌ వికెట్‌ రూపంలో ఔటై..  భారత్‌ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో హిట్‌ వికెట్‌ రూపంలో వెనుదిరిగిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 10వ ఓవర్లో కుశాల్‌ మెండీస్‌ వేసిన ఐదో బంతిని ఎదుర్కొనే క్రమంలో కాస్త వెనక్కి వెళ్లాడు. ఆ సమయంలో అతడి కుడి కాలు వికెట్లను తాకడంతో బెయిల్స్‌ కిందపడ్డాయి. దీంతో రాహుల్‌ హిట్‌ వికెట్‌ రూపంలో పెవిలియన్‌ బాట పట్టాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 10మంది ఆటగాళ్లు హిట్‌ వికెట్‌ రూపంలో ఔటయ్యారు.

వన్డే క్రికెట్లో ఇప్పటి వరకు 65 మంది హిట్‌ వికెట్‌ రూపంలో ఔటవ్వగా ఇందులో నలుగురు భారతీయులు ఉన్నారు. నయన్‌ మోంగియా(1995లో, పాకిస్థాన్‌పై), అనిల్‌కుంబ్లే(2003లో, న్యూజిలాండ్‌పై), సచిన్‌ తెందుల్కర్‌(2008లో, ఆస్ట్రేలియాపై), విరాట్‌ కోహ్లీ(2011లో, ఇంగ్లాండ్‌పై) వన్డే క్రికెట్లో హిట్‌ వికెట్‌గా వెనుదిరిగారు. అలాగే టెస్టుల్లో చూస్తే ఇప్పటి వరకు 158 మంది ఆటగాళ్లు ఇలా ఔటయ్యారు. భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి లాల్‌ అమర్‌నాథ్‌ చెన్నైలో వెస్టిండీస్‌తో 1949లో జరిగిన టెస్టులో హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. భారత మాజీ ఆటగాడు మోహింద‌ర్‌ అమర్‌నాథ్‌ అయితే ఏకంగా మూడుసార్లు ఇలా ఔటయ్యాడు. అటు టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ హిట్‌ వికెట్‌ రూపంలో వెనుదిరిగిన ఒకే ఒక్క భారత ఆటగాడు విరాట్‌ కోహ్లీ కావడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Mohammed shami makes a big statement on patch up with wife

  ఇక అమెతో కలసి జీవించడం కుదరదు: షమి

  Mar 15 | టీమిండియా పేసర్‌ మహమ్మద్‌ షమి చాలా మంచోడని మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, ధోని సహా ఆయనకు పిల్లనిచ్చిన మామ కూడా మద్దతు పలికిన నేపథ్యంలో, ఆయన భార్య హసీన్‌ జహాన్‌ మాత్రం తన... Read more

 • Australia women seal odi series over india women with big win

  అసీస్ తో వన్డే సిరీస్ చేజార్చుకున్న టీమిండియా

  Mar 15 | వరల్డ్ కప్ లో సత్తాచాటిన టీమిండియా.. ద్వైపాక్షిక సిరీస్ లో మాత్రం కంగారులతో తడబాటుకు గైరంది. స్వదేశంలో జరుగుతున్నసిరీస్ లో ఒకటి తరువాత మరో మ్యాచులో కూడా ఓటమిని చవిచూసి వరుస పరాజయాలను ఎదుర్కొంది.... Read more

 • Psl 2018 sohail khan throws ball at yasir shah to get his attention

  పాకిస్తాన్ క్రికెట్ లీగ్ మళ్లీ ఇలా వార్తల్లోకి..

  Mar 15 | పాకిస్థాన్ సూపర్‌ లీగ్.. రికార్డులతో కాకుండా మైదానంలో ఆటగాళ్ల మధ్య చోటు చేసుకుంటున్న ఘటనలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల అఫ్రిది ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను ఔట్‌ చేసి పెవిలియన్ దారి చూపించి... Read more

 • Washington s spell up front was magical says rohit sharma

  సుందర్ స్పీన్ మాయాజలంతోనే నల్లేరుపై నడక..

  Mar 15 | టీమిండియా యువ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్ పై తాత్కాలిక కెప్టెన్ రోహిత్‌ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ 20 ముక్కోణపు టోర్నీలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచులో వాషింగ్టన్ సుందర్ తన స్పీన్... Read more

 • Dannielle wyatt to use virat kohli s bat during england tour of india

  అభిమాన క్రికెటర్ ఇచ్చిన బ్యాటుతోనే ట్రై సీరీస్ కు..

  Mar 13 | భారత పరుగుల యంత్రం, కెప్టన్ విరాట్ కోహ్లీకి బహిరంగంగా లవ్ ప్రమోజ్ చేసి.. తనను పెళ్లి చేసుకోవాలని అగిడిన మహిళా క్రికెటర్ గుర్తుందా..? ఎవరామె..? అంటారా.. అమె ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ డేనియెల్లి వాట్‌.... Read more

Today on Telugu Wishesh