Meet Rashid Khan Youngest Captain in Cricket | వన్డే క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు నెలకొల్పిన అఫ్ఘన్ ప్లేయర్

Afghan bowler record

Afghanistan, Cricket Team, Rashid Khan, Youngest ODI Captain, Young Captain in Cricket, Captain Rashid Khan

Afghanistan Player Rashid Khan becomes youngest captain in international cricket. Rashid Khan, 19, stepped in as skipper for Afghanistan in the absence of Asghar Stanikzai who has been diagnosed with appendicitis.

అత్యంత పిన్న వయస్కు కెప్టెన్ గా రషీద్

Posted: 03/05/2018 01:13 PM IST
Afghan bowler record

అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ఆటగాడు రషీద్ ఖాన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డేలో అత్యంత చిన్న వయస్కు కెప్టెన్ గా రికార్డు సాధించాడు. ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భాగంగా ఆదివారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఈ ఘనత సాధించాడు.

ఒక జాతీయ క్రికెట్‌ జట్టుకు అత్యంత పిన్న వయసులో నాయకత్వం వహించి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. కెప్టెన్  అఫ్జఘర్ అపెండిసైటిస్ జరగటంతో మ్యాచ్ కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఆ స్థానంలో రషీద్ ను తీసుకున్నారు. 19 ఏళ్ల 165 రోజుల వయసులో  రషీద్‌ ఖాన్‌ అఫ్గానిస్తాన్‌కు సారథిగా వ్యవహరించాడు. అంత​కుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్‌ ఆటగాడు రజిన్‌ సలేహ్‌ పేరిట ఉండేది. 20 ఏళ్ల 297 రోజుల వయసులో బంగ్లాదేశ్‌కు రజిన్‌ నాయకత్వం వహించాడు. కాగా, ఆ రికార్డును రషీద్‌ ఖాన్‌ బద్ధలు కొట్టాడు.

ప్రస్తుతం రషీద్‌ ఖాన్‌ వన్డే, టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండటం మరో విశేషం. నిన్న జరిగిన మ్యాచ్‌లో రషీద్ నేతృత్వంలోని అప్ఘాన్ జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో రషీద్ పేలవ ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో ఎల్బీగా గోల్డెన్ డక్ అయిన రషీద్.. 9 ఓవర్లు బౌలింగ్ చేసిన 68 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles