Bhuvneshwar Kumar savours maiden T20I 5-wicket haul అరుదైన భారత బౌలర్ రికార్డను అందుకున్న భువి

India vs south africa bhuvneshwar kumar savours maiden t20i 5 wicket haul

1st T20, India vs South Africa, South Africa vs India 2018, virat kohli, India v/s South Africa, Ind vs SA, Shikhar Dhawan, Bhuvneshwar Kumar, South Africa v India at Johannesburg, India tour of South Africa, India cricket, South Africa cricket, sports news,sports, latest sports news, cricket news, cricket

Pacer Bhuvneshwar Kumar was a happy man following his maiden five-wicket haul in the first Twenty20 International against South Africa at the New Wanderers stadium in Johannesburg

అరుదైన భారత బౌలర్ రికార్డను అందుకున్న భువి

Posted: 02/19/2018 12:54 PM IST
India vs south africa bhuvneshwar kumar savours maiden t20i 5 wicket haul

భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు నమోదు కానీ అరుదైన రికార్డును తన పేరున లిఖించుకున్నాడు ఫేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.  టీమిండియా బౌలర్లలో ఏ ఒక్కరూ దీనిని సాధించనప్పటికీ.. అదివారం అతిథ్యజట్టు సౌతాఫ్రికాతో జరిగిన తొలివన్డే మ్యాచులో భువనేశ్వర్ కుమార్ ఓ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించాడు. మ్యాచ్ లో ఐదు వికెట్ల తీయడమే ఆయనను రికార్డును నమోదు చేసేలా చేసింది. అదేంటి ఇలా చాలా మంది బౌలర్లు వికెట్లు తీసారుకదా అంటే.. మూడు క్రికెట్ ఫార్మాట్లలో దీనిని సాధించిన ఏకైన బౌలర్ భువనేశ్వర్.  టెస్టు, వన్డేలలో ఇలా ఐదు వికెట్లు సాధించిన భువి.. నిన్నటి టీ20 మ్యాచ్ లోనూ ఈ ఫీట్ సాధించి అరుదైన రికార్డును నమోదు చేశాడు.

టీమిండియా తరపున 21 టెస్టులలో పాల్గోని ప్రదర్శన ఇచ్చిన భువీ, 4 సార్లు ఐదు వికెట్లను పడగొట్టిన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇక వన్డేల విషయానికి వస్తే.. ఇప్పటివరకు 86 వన్డే మ్యాచులు ఆడిన భువనేశ్వర్.. ఒక్క పర్యాయం మాత్రం 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక టీ20 మ్యాచ్ లలో నిన్న సఫారీలపై ఈ ఘనతను సాధించాడు. దీంతో మూడు ఫార్మెట్లలో ఈ ఘనతను సాధించిన వాడిగా రికార్డును అందుకున్నాడు. కాగా, తన బౌలింగ్ పేస్ విషయంలో చేసిన మార్పులే తనకు ఈ ఘనతను అందుకునేలా చేసిందని భువి మీడియాతో మాట్లాడుతూ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles