Dhawan, Bhuvneshwar give India 1-0 lead బ్యాటుతో ధావన్.. బాల్ తో భువి మెరిసి మెప్పించారు..

India vs south africa 1st t20 shikhar dhawan bhuvneshwar kumar help ind go 1 0 up

1st T20, India vs South Africa, South Africa vs India 2018, virat kohli, India v/s South Africa, Ind vs SA, Shikhar Dhawan, Bhuvneshwar Kumar, South Africa v India at Johannesburg, India tour of South Africa, India cricket, South Africa cricket, sports news,sports, latest sports news, cricket news, cricket

A 28-run win, with starring roles for Shikhar Dhawan and Bhuvneshwar Kumar, gave India a 1-0 lead in the three-match T20I series, but they may not have left the Wanderers entirely thrilled about their performance

బ్యాటుతో ధావన్.. బాల్ తో భువి మెరిసి మెప్పించారు..

Posted: 02/19/2018 12:32 PM IST
India vs south africa 1st t20 shikhar dhawan bhuvneshwar kumar help ind go 1 0 up

సఫారీ గడ్డపై ఇప్పటి వరకు సాధించని వన్డే సిరీస్ ను కైవసం చేసుకుని అరుదైన రికార్డు అందుకున్న టీమిండియా ఇక అదే జోరును టీ20లలో కూడా కనబర్చిచింది. టీ20 సిరీస్ ను కూడా సొంత చేసుకుని తమ సత్తా చాటాలని భావిస్తున్న విరాట్ సేన జోహెనెస్స్ బర్గ్ లో జరిగిన తొలి టీ20ని గెలుచుకుంది. అటు బ్యాటింగ్ లో శిఖర ధావన్ ఇటు బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ మెరవడంతో.. తొలి టీ20లో టీమిండియా విజయం నల్లేరుపై నడకగానే సాగింది. ఫలితంగా టీమిండియా దక్షిణాఫ్రికాపై 28 పరుగులతో విజయం సాధించి.,. మూడు టీ20 సిరీస్ లలో 1-0తో కొనసాగుతుంది.

తొలి టీ20లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సఫారీలు భారత్ ను కట్టడి చేయాలని భావించినా అది అనుకూలించలేదు. భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన బ్యాటును జుళిపించడంతో పరుగుల వరద కొనసాగింది. ఓపెనర్ రోహిత్ శర్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అయితే 9 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 21 పరుగులు సాధించిన రోహిత్ జూనియర్ డోలా బౌలింగ్ లో క్లాసెస్ కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ కు చేరకున్నాడు. దీంతో క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మతో కలసి మరో ఓపెనర్ శిఖర్ దవన్ సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 39 బందుత్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 72 పరుగులతో స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. ఇక సురేశ్ రైనా 15, కెప్టెన్ కోహ్లీ 26, మనీష్ పాండే 29, ధోనీ 16, హార్దిక్ పాండ్యా 13 పరుగులు చేశారు.

దీంతో టీమిండియా విసిరిన విజయలక్ష్య చేధనలో సఫారీలు బోర్లా పడ్డారు. విరాట్ సేన నిర్దేశించిన 204 పరుగుల విజయలక్ష్యాన్ని అందుకోవడంతో విఫలమైంది. డుమిని సేన కేవలం 175 పరుగుల వద్ద కుప్పకూలింది. లక్ష్యచేధన దిశగా బ్యాటింగ్  ప్రారంభించిన దక్షిణాఫ్రికా 29 పరుగుల వద్ద స్మట్స్ (14) రూపంలో తొలి వికెట్ కోల్పోయినా రీజా  హెన్‌డ్రిక్స్ (70) జట్టును ఆదుకున్నాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో భారత శిబిరంలో గుబులు రేపాడు. రెచ్చిపోతున్న హెన్‌డ్రిక్స్‌ను భువీ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించి పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా వెంటవెంటనే వికెట్లు కోల్పోయినా ఫర్హాన్ బెహర్‌డీన్ క్రీజులో నిలదొక్కుకుని మెరుపులు మెరిపించాడు. 27 బంతుల్లో మూడు 4, రెండు సిక్సర్లతో 39 పరుగులు చేసి జట్టును విజయం వైపుగా తీసుకెళ్లాడు.

అయితే, అతడి ఆశలపై చాహల్ నీళ్లు పోశాడు. మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చి వెనక్కి వెళ్లాడు. ఇక ఆ తర్వాతి నుంచి దక్షిణాఫ్రికా కోలుకోలేదు. సాధించాల్సిన పరుగులకు-బంతులకు మధ్య తేడా పెరిగిపోతుండడంతో ఒత్తిడికి లోనైన సఫారీలు చివరికి చేతులెత్తేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసి విజయానికి 28 పరుగుల దూరంలో నిలిచిపోయారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లు పడగొట్టగా, ఉనద్కత్, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు. కాగా అంతకుముందు సౌతాఫ్రికా జట్టులో జూనియర్ డోలా 2 వికెట్లు, క్రిస్ మెరిస్ తబ్రియాక్ షంఫీ, సెహ్తూక్వాయో చెరో వికెట్ తీసుకున్నారు. రెండు వన్డే సెంచూరియన్ వేదికగా బుధవారం జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles