Shastri: No better batsman than Kohli ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్ మెన్ కోహ్లీ మాత్రమే: రవిశాస్త్రీ

Get latest oxford dictionary to praise virat kohli ravi shastri

virat kohli, ravi shasri, team india, south africa, oxford dictionery, best batsman, rahsid khan twitter, rashid khan virat kohli, virat kohli, rashid khan, team india, south africa, zimbabwe, afganistan twitter, Cricket news, sports news, sports, latest sports updates, cricket

India coach Ravi Shastri has declared his captain Virat Kohli as the best batsman in the world across all formats.

కోహ్లీని ప్రశంసించాలని భావిస్తే.. కొత్త అక్స్ ఫోర్డ్ డిక్షనరీ కొనుక్కొండీ

Posted: 02/17/2018 04:53 PM IST
Get latest oxford dictionary to praise virat kohli ravi shastri

దక్షిణాప్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను 2-1 అదిక్యంతో కొల్పయిన క్రమంలో వినిపించిన విమర్శలు అదే జట్టుపై వన్డే సిరీస్ ను 5-1 తో గెలిచిన నేపథ్యంలో విమర్శకులు టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీని వర్ణించేందుకు కొత్త ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ కొనుక్కోవాలని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రీ సలహా ఇచ్చాడు. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సఫారీ గడ్డపై తొలి సిరీస్‌ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ..‘ విరాట్ కోహ్లీని పొగుడుతూ రాయడానికి బహుశా మీకు (మీడియాను టార్గెట్ చేసినా.. విమర్శకులపైనే ఆయన గురి) పదాలు కరువై ఉంటాయి. మీకు ఒక సలహా ఇస్తా. ఒకవేళ మీ స్థానంలో నేను ఉంటే నేరుగా బుక్ స్టోర్ కు వెళ్లి కొత్త ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువు కొనుక్కుంటాను. నా పద సంపదను పెంచుకుంటాను’ అని తెలిపాడు.

‘ బ్యాట్స్ మెన్ల యావరేజ్ బట్టి వారి అడలేదన్న నిర్ణయానికి రాకూడదని, వారు ఎలాంటి సమయంలో పరుగులు రాబడుతున్నారన్న దానిని పరిగణలోకి తీసుకోవాలని, ఆ పరుగులు జట్టు విజయానికి ఎంత కీలకంగా మారాయో గుర్తించాలని రవిశాస్త్రి సూచించాడు. ప్రపంచంలోని మేటి బ్యాట్స్ మెన్లలో కోహ్లీనే బెస్ట్ అని కితాబిచ్చాడు. అందుకు‌ అతను సఫారీలతో అరు మ్యాచులలో సాధించిన 558 పరుగులే నిదర్శనమని శాస్త్రి అన్నాడు.

ఇప్పుడు జట్టు విజయంలో కుల్దీప్, చాహల్ ఇద్దరు స్పిన్నర్లు కీలకంగా మారారని అన్నారు. గతంలో టీమిండియాను ప్రత్యర్థి జట్ట మిడిల్ అర్డర్ వికెట్లను పడగొట్టమే సమస్యగా వుండేదని, కుల్దీప్‌ యాదవ్‌-చాహల్‌ తో అది తీరిందని అన్నాడు. వీరిద్దరూ మంచి ప్రదర్శన ఇస్తున్నారు. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, స్పిన్‌ బౌలింగ్లో గొప్పగా రాణిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని విదేశీ పర్యటనలు చేయాల్సి ఉందని.. అలాంటి సమయంలో దక్షిణాఫ్రికా పర్యటన ప్రస్తుత భారత జట్టుకు ఎంతో నేర్పింది. యువ ఆటగాళ్లకు సఫారీగడ్డ మంచి అవకాశాన్ని అనుభవాన్ని పంచిందని అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  ravi shasri  team india  south africa  oxford dictionery  best batsman  cricket  

Other Articles