India wrap up series 5-1 against proteas వన్డేలలో చరిత్రను తిరగరాసిన విరాట్ సేన

Virat kohli sounds warning to cricket world after 35th century

Cricket, India Vs South Africa, India vs South Africa ODI series, India's tour of South Africa, ODI Cricket, South Africa vs India 2018, Virat Kohli, Yuzvendra Chahal, South Africa cricket team, Khaya Zondo, Indian cricket team, Imran Tahir, Hashim Amla, Cricket news, Sports news, latest news, sports, cricket news, cricket

Another Virat Kohli batting masterclass guided India to a historic 5-1 series victory with a comfortable 8 wicket win in Centurion.

సఫారీలపై వన్డే సిరీస్ ను 5-1తో గెలిచిన విరాట్ సేన..

Posted: 02/17/2018 11:26 AM IST
Virat kohli sounds warning to cricket world after 35th century

టీమిండియా కెప్టెన్, ది రన్ మిషీన్ విరాట్ కోహ్లీ సెంచూరియన్ లో తన సత్తా చాటాడు. అజేయశతకంతో సఫారీల అశలపై నీళ్లు చల్లాడు. అరు వన్డేల సిరీస్ ను  5-1తో కైవసం చేసుకుని చరిత్రను తిరగరాశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ కు కొత్త బాష్యం చెబుతూ.. నామమాత్రపు మ్యాచులోనూ తనదైన మార్కు బౌండరీలను, సిక్సర్లను మైదనం నలువైపులా బాదుతూ.. మ్యాచ్ వీక్షకులకు కన్నుల పండగను అందించాడు. విరాట్ విశ్వారూపాన్ని ఏ కోణంలోనూ కళ్లాలు వేయలేక సఫారీలు.. ఓటమితో వెనుదిరిగారు.

ఈ మ్యాచు తరువాత టీ-20 సిరీస్ ప్రారంభం కానుండటంతో దానికి తాను సన్నద్ధంగా వున్నానన్న సంకేతాలను సఫారీలకు పంపించాడు.కోహ్లీ తన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో అలరించాడు. ఐదో వన్డేలో సెంచరీ కొట్టిన రోహిత్‌ శర్మ(15) నాలుగో ఓవర్లోనే వెనుదిరిగడంతో క్రీజులోకి వచ్చి విరాట్ చెలరేగాడు. మరో ఎండ్‌లో ధవన్‌ (18) స్ట్రయిక్‌ రొటేట్‌ చేయగా.. విరాట్‌ బౌండ్రీలనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 13వ ఓవర్లో ధవన్ వెనుదిరిగా.. తగ్గని విరాట్.. రహానేతో కలిసి అజేయ శతకాన్ని నమోదు చేశాడు.

నాణ్యమైన ఫుట్ వర్క్ తో చూడచక్కటి డ్రైవ్ షాట్లు, కట్‌, పుల్‌ షాట్లతో బౌండ్రీలు రాబట్టాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వని విరాట్.. 36 బంతుల్లోనే అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత అదే జోరుతో సెంచరీని బాదాడు. తాహిర్‌ బౌలింగ్‌లో స్ట్రెయిట్‌ డ్రైవ్‌తో బౌండ్రీ కొట్టి 82 బంతుల్లోనే కెరీర్‌లో 35వ శతకాన్ని అందుకున్నాడు. ఆ తరువాత కూడా జోరతగ్గించని విరాట్.. తాహిర్‌ బౌలింగ్లోనే వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది మ్యాచ్ ను ముగించాడు. కాగా అజింక్య రహానే కూడా 34 పరుగులతో విరాట్ కు చక్కని సహకారం అందించాడు.
 
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సఫారీలను భారత బౌలర్లు కట్టడి చేశారు. అరో వన్డేలో తుది జట్టులో అవకాశం రావడంతో షార్ట్‌లెంగ్త్‌ బంతులతో ఓపెనర్లకు పరీక్షపెట్టిన శార్దూల్‌ ఠాకూర్ ఓపెనర్‌ మార్‌క్రమ్‌ (24), ఆమ్లా (10) అవుట్‌ చేసి భారత్‌కు గొప్ప ఆరంభాన్ని ఇచ్చాడు. దీంతో క్రీజులోకి వచ్చిన డివిల్లీర్స్‌, జోండో ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. కాగా, ఏబీ డివీలియర్స్ ను చాహల్‌ క్లీన్ బోల్డ్ చేసి పెవీలియన్ కు పంపాడు. కాగా, జొండో మాత్రం 30 ఓవర్ల లోపు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

ఈ దశలో భారత బౌలర్లు వరుస పెట్టి వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశారు. 31వ ఓవర్లో క్లాసెన్‌ను బుమ్రా, బెహర్డీన్‌ (1)ను శార్దూల్‌, మోరిస్‌ (4)ను కుల్దీప్‌ అవుట్‌ చేశారు. జోండోను చాహల్‌ వెనక్కుపంపడంతో సౌతాఫ్రికా 151/7తో డీలా పడింది. అయితే, పెహ్లుక్వాయోతో పాటు చివర్లో మోర్కెల్‌ (20) భారీ షాట్లు ఆడి విలువైన పరుగులు అందించారు. మోర్కెల్‌ వెనుదిరిగినా.. శార్దూల్‌ బౌలింగ్ లో 2 సిక్సర్లు కొట్టిన పెహ్లుక్వాయో జట్టు స్కోరు 200 దాటించాడు. మరో షాట్‌ ఆడే ప్రయత్నంలో అతను శార్దూల్‌కే రిటర్న్‌ ఇవ్వడంతో సఫారీల ఇన్నింగ్స్‌ ముగిసింది. వన్డే సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీని మ్యాన్ అప్ ది మ్యచ్, మ్యాన్ అఫ్ ది సిరీస్ అవార్డులు వరించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India Vs South Africa  centurion  ODI Cricket  ODI Series  south africa  Team India  Virat Kohli  cricket  

Other Articles