Rohit Sharma Woos Ritika with a special gift రో‘హిట్’ 17 టన్ను కొట్టినా సంతోషంగా లేడా.?

Rohit sharma not celebrated his ton in port elizabeth why

5th ODI, India vs South Africa, South Africa vs India 2018, virat kohli, Ajinkya Rahane, rohit sharma, ODI, India v/s South Africa, Ind vs SA, MS Dhoni, chahal, Hardik Pandya, sports news,sports, latest sports news, cricket news, cricket

Team India opener Rohit Sharma finally managed to get among runs during India’s 73-run win against South Africa at St George’s Park.

రో‘హిట్’ 17 టన్ను కొట్టినా సంతోషంగా లేడా.?

Posted: 02/15/2018 03:53 PM IST
Rohit sharma not celebrated his ton in port elizabeth why

వరుసగా నాలుగు మ్యాచ లలో వైఫల్యం. అభిమానులతో పాటు జట్టు మేనేజ్ మెంట్ నుంచి కూడా ఒత్తిడి. దక్షిణాఫ్రికాతో ఐదో వన్డే ముందు ఓపెనర్ రోహిత్ శర్మ పరిస్థితి ఇదే. ఫామ్ లేమిలో ఉన్న వేళ, అద్భుతంగా ఆడి సెంచరీ సాధిస్తే, ఎవరైనా ఎగిరి గంతులేసి గ్రౌండులో అందరికీ అభివాదం చెబుతారు. కానీ, రోహిత్ శర్మ మాత్రం మామూలుగానే ఉండిపోయాడు. అతనిలో సెంచరీ ఆనందం కనిపించలేదు. తిరిగి బ్యాటింగ్ లో నిమగ్నమయ్యాడు.

ఎందుకని అలా చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని మీడియాకు వెల్లడించిన రోహిత్, తన కళ్లముందే ఇద్దరు కీలక ఆటగాళ్లు రన్నౌట్ అయ్యారని, తప్పు ఎవరిదైనా, వారి రన్నౌట్ లో తనకూ భాగస్వామ్యముందని చెప్పాడు. అందుకే సెంచరీ తరువాత సంబరాల ఆలోచన తన మనసులోకి రాలేదని అన్నాడు. ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నామన్న విషయంపైనే సంబరాలు ఆధారపడి ఉంటాయని చెప్పుకొచ్చాడు.ఇక, వాలెంటైన్స్ డే సందర్భంగా తన భార్య రితికా సజ్దేకు అభినందనలు తెలిపిన రోహిత్, ఐదో వన్డేలో అందుకున్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీ పట్టుకుని ఫోటో దిగి, ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేశాడు. 'వాలెంటైన్స్‌ డే శుభాకాంక్షలు రితిక' అంటూ క్యాప్షన్ పెట్టాడు.


Happy Valentine’s Day Rits @ritssajdeh

A post shared by Rohit Sharma (@rohitsharma45) on

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs South Africa  5h ODI  rohit sharma  virat kohli  Ajinkya Rahane  cricket  

Other Articles