zim vs afgG scores from first game reversed క్రికెట్ లో అసాధారణం: సేమ్ టు సేమ్ గణంకాలు..

Zimbabwe vs afghanistan in second odi after scores from first game are reversed

Afghanistan Cricket Team, Afghanistan vs Zimbabwe, Cricket, Ihsanullah, Najibullah Zadran, ODI Cricket, Rashid Khan, UAE, Zimbabwe Cricket Team, sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, sports news,sports, latest sports news, cricket

Zimbabwe beat Afghanistan by 154 runs in the second ODI in Sharjah – after the scores from the first clash were completely reversed.

జట్టు పేర్లలోనే మార్పు.. మిగతాదంతా సేమ్ టు సేమ్

Posted: 02/12/2018 04:53 PM IST
Zimbabwe vs afghanistan in second odi after scores from first game are reversed

క్రికెట్ చరిత్రలో ఇదో అసాధారణ ఘటన. వన్డే మ్యాచ్ లో గెలుపోటములు సహజం. అయితే పలు సందర్బాలలో మ్యాచులు డ్రాగా కూడా ముగుస్తాయి. ఇలాంటివే ఎప్పుడో ఒక్కసారి జరుగుతాయి. వీటిని ఏ జట్టులోనైనా వేళ్ల మీద లెక్కించవచ్చు. కానీ క్రికెట్ అనగానే ఆసక్తికర ఘటనలు, గణాంకాలు, కొత్త మైలురాళ్లు కూడా చోటుచేసుకుంటాయి. కానీ, రెండు దేశాల మధ్య జరిగిన ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులో ఏకంగా అసాధారణ గణంకాలు నమోదయ్యాయి. ఎంతలాఅంటే క్రికెట్ ఫాలోవర్స్ ను ఏకంగా అశ్చర్యానికి గురిచేసేలా వున్నాయి ఈ గణంకాలు.

క్రికెట్ చరిత్రలోనే సేమ్ టు సేమ్ గణంకాలు నమోదైన ఏకైక మ్యాచ్ గా నిలిచింది ఈ రెండు జట్ల మధ్య గణంకాలు. జింబాబ్వే, ఆఫ్గనిస్థాన్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ఈ గణంకాలు నమోదయ్యాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. జింబాబ్వే.. అప్ఘనిస్తాన్ మధ్య వన్డే సిరీస్ కొనసాగుతుంది. తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్థాన్ జట్టు 5 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేయగా, జింబాబ్వే జట్టు 10 వికెట్ల నష్టానికి 179 పరుగులు మాత్రమే చేసింది.  దీంతో అప్ఘనిస్తాన్ 154 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది.

ఇక రెండో వన్డేలో ప్రతీకారేచ్చతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న జింబాబ్వే.. అచ్చంగా అప్ఘనిస్తాన్ తొలి వన్డేలో నమోదు చేసినట్లుగానే 5 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. దీంతో 334 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా సరిగ్గా తొలి వన్డేలో జింబాబ్వే జట్టు తరహాలోనే 179 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో సిరీస్ 1-1తో సమమైంది. అయితే ఈ రెండు మ్యాచ్ ల్లో నమోదైన గణంకాలు మాత్రం జట్ల పేరును మాత్రమే మార్చుకున్నాయి తప్ప.. మిగిలినదంతా సేమ్ టు సేమ్ గా రిపీట్ అయ్యింది. ఇది క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.

దీంతో ఈ రెండు జట్ల మధ్య నమోదైన పరుగుల గణాంకాలు గతంలో క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ నమోదు కాలేదని వారు అంటున్నారు. ఇక భవిష్యత్తులోనూ ఈ రెండు జట్ల మధ్య నమోదైన గణంకాలు ఏ దేశం జట్ల మధ్య కూడా నమోదవుతాయని కూడా భావించలేమని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకే సిరీస్ లో రెండు వరుస మ్యాచ్ లలో ఈ తరహా పరుగుల అంకెలు కనిపించడం ఇదే తొలిసారని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి అసాధారణ ఘటనలు చోటుచేసుకునేది ఒక్క క్రికెట్ లోనే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దట్ ఇజ్ క్రికెట్ అని కూడా చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Afghanistan  Zimbabwe  Cricket  Afg vs Zim  ODI Cricket  Rashid Khan  Cricket  

Other Articles