Richardson picks Test dream over IPL భాగస్వామి కోసం ఈ భాధను భరిస్తా

Kane richardson reveals why he did not put his name for ipl 2018

india vs australia, ind vs aus, IPL 2018,Kane Richardson,IPL,Indian Premier League,Virat Kohli,Royal Challengers Bangalore,Rajasthan Royals,IPL auction 2018, Australia, pacer, pune warriors, royal chanllengers banglore, Cricket

Australia fast bowler Kane Richardson has opened on his decision to skip the Indian Premier League [IPL] this year citing his wedding in April

భాగస్వామి కోసం ఈ భాధను భరిస్తా

Posted: 02/09/2018 07:27 PM IST
Kane richardson reveals why he did not put his name for ipl 2018

ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అందుకే ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడట్లేదు’ అని చెప్పాడు ఆస్ట్రేలియా బౌలర్‌ కేన్‌ రిచర్డ్‌సన్‌. 2013లో పుణె వారియర్స్‌ రూ.4.5కోట్లు వెచ్చించి రిచర్డ్‌సన్‌ను కైవసం చేసుకుంది. అనంతరం రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకి రిచర్డ్‌సన్‌ ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 14 ఐపీఎల్‌ మ్యాచ్‌లాడిన అతడు 24.61 సగటుతో 18 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

తాజాగా రిచర్డ్‌సన్‌ మాట్లాడుతూ..‘నేను ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలోకి రాకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పెళ్లి. రెండోది ఆసీస్‌ టెస్టు జట్టులో స్థానం దక్కించుకోవడం. ఇప్పుడు  నా వయసు 26ఏళ్లు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత టెస్టు జట్టులో స్థానం కోసం షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో ఆడాలనుకుంటున్నాను.

ఈ టోర్నీలో ప్రతిభ ఆధారంగానే జట్టు ఎంపిక జరుగుతోంది.  అందుకే ఈ ఏడాది ఐపీఎల్‌ కోసం నిర్వహించిన ఆటగాళ్ల వేలంలో నా పేరు చేర్చలేదు. వచ్చే ఏడాది ఐపీఎల్‌ ఆడేందుకు ప్రయత్నిస్తా’ అని రిచర్డ్‌సన్‌ తెలిపాడు. ఇప్పటి వరకు రిచర్డ్‌సన్‌ ఆసీస్‌ తరఫున 15 వన్డేలు, 5 టీ20లు మాత్రమే ఆడాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles