Visitors Keen To Seal Off An Unbeatable Lead సఫారీల గడ్డపై టీమిండియా చరిత్రను తిరగరాస్తుందా..?

India vs south africa 3rd odi visitors keen to seal off an unbeatable lead

1st ODI, durban odi, India vs South Africa, South Africa vs India 2018, virat kohli, Ajinkya Rahane, rahane, ODI, India v/s South Africa, Ind vs SA, MS Dhoni, cape town, chahal, Hardik Pandya, sports news,sports, latest sports news, cricket news, cricket

India are 2-0 ahead in the series and are also way ahead mentally and physically as the hosts are struggling to recover from an array of injuries that have plagued them throughout the series

సఫారీల గడ్డపై టీమిండియా చరిత్రను తిరగరాస్తుందా..?

Posted: 02/06/2018 07:52 PM IST
India vs south africa 3rd odi visitors keen to seal off an unbeatable lead

సఫారీ గడ్డపై ఇప్పటి వరకు సాధించని అరుదైన రికార్డును నెలకొల్పే దిశగా విరాట్ సేన ఉవ్విళ్లూరుతుంది. మూడో వన్డే గెలిచిన తరువాత మరో మ్యాచ్ గెలిస్తే కానీ అరు వన్డేల సిరీస్ ను టీమిండియా కైవసం చేయాలన్న లక్ష్యంతో పాటు ఐసీసీ నెంబర్ వన్ ర్యాంకింగ్ పై కన్నేసిన విరాట్ సేన.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే రానున్న వన్డేతో చరిత్ర ఎలా తిరగరాస్తారనేగా మీ డౌట్. వరుసగా రెండు వన్డేల్లో విజయ దుందుభి మోగించిన కోహ్లీసేన మూడో మ్యాచ్ పై కన్నేసింది. కీలక పోరులో గెలిచి చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది.

దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు భారత్‌ ఒక్క ద్వైపాక్షిక సిరీస్‌లోనూ రెండు మ్యాచ్‌లు మించి గెలిచింది లేదు. ఇప్పుడు ఆ సదవకాశం టీమిండియా ముందు నిలిచింది. ఆతిథ్య జట్టులో అనుభవజ్ఞులు గాయాలపాలై దూరమైన వేళ కోహ్లీసేనకు ఈ విజయం నల్లేరుపై నడకగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఆరు వన్డేల సిరీస్‌లో భారత్‌ తన సత్తా ఏంటో చూపించింది. మణికట్టు స్పిన్‌ ద్వయం చెలరేగడంతో డర్బన్‌లో 6, సెంచూరియన్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయాలు సాధించింది. ఇప్పుడు జరుగుతున్న కేప్‌టౌన్‌లోనూ గెలిచి తీరాలని పర్యాటక జట్టు కసితో ఉంది. సిరీస్‌ గెలిచి టెస్టు సిరీస్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది.

మరోవైపు కోహ్లీసేన ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంది. మూడో మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ విజయానికి మరింత దగ్గరవ్వాలని పట్టుదలతో ఉంది. రోహిత్‌ను మినహాయిస్తే ధావన్‌, కోహ్లీ, రహానె ఫామ్‌ కనబరిచారు. మిడిలార్డర్‌లో ధోనీ, కేదార్‌ జాదవ్‌ ఉండనే ఉన్నారు. ఇక పేసర్లకు తోడు మణికట్టు స్పిన్‌ ద్వయం వికెట్లును తీస్తూ మ్యాచ్‌లను నిలబెడుతోంది. జట్టు ఎంపిక పరంగానూ కోహ్లీకి ఇబ్బంది లేదు. పాత జట్టుతోనే బరిలోకి దిగొచ్చు. ప్రస్తుతం 2-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా నిలకడగా ఆడితే దక్షిణాఫ్రికాలో సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించవచ్చు. మ్యాచ్‌ జరిగే న్యూలాండ్స్‌ పిచ్‌ స్వింగ్‌కు, బౌన్స్‌కు అనుకూలిస్తుంది. 1992 నుంచి భారత్‌ ఇక్కడ నాలుగు వన్డేలు ఆడగా రెండు గెలిచి రెండు ఓడింది.     

దక్షిణాఫ్రికాలో 1992-93, 2010-11లో పర్యటించిన భారత జట్టు ద్వైపాక్షిక సిరీసుల్లో రెండు మ్యాచులు గెలిచింది. రెండో పర్యటనలో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా వరుసగా మూడు మ్యాచులు ఓడి చివరికి 3-2తో సిరీస్‌ చేజార్చుకుంది. మరోసారి 5-2తో వెనకబడ్డారు. అయితే ప్రస్తుతం ఆతిథ్య జట్టు ఉన్న పరిస్థితుల్లో భారత్‌ సిరీస్‌ గెలపుపై అశలు రెట్టింపయ్యాయి. ‘మిస్టర్‌ 360’ డిగ్రీ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌, తొలి వన్డేలో శతకం సాధించిన సారథి డుప్లెసిస్‌ వేలి గాయాలతో జట్టును వీడారు. తాజాగా మరో సీనియర్‌ ఆటగాడు, కోహ్లీసేనపై అద్భుత రికార్డు ఉన్న వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ క్వింటన్‌ డికాక్‌ మణికట్టు గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో కొత్త కుర్రాడు హెన్రిచ్‌ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs South Africa  3st ODI  cape town odi  virat kohli  Ajinkya Rahane  cricket  

Other Articles