Jhulan Goswami makes unique record ప్రత్యేక రికార్డును అందుకున్న జులన్ గోస్వామి

India vs south africa 1st odi jhulan goswami makes unique record

india vs south africa, jhulan goswami, mithali raj, punam raut, smriti mandhana, sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Jhulan Goswami made a unique record during the first ODI match of the three-match series between India and South Africa, as she became the first women cricketer across the globe to score 1000 runs and 150 wickets.

ప్రత్యేక రికార్డును అందుకున్న జులన్ గోస్వామి

Posted: 02/06/2018 07:02 PM IST
India vs south africa 1st odi jhulan goswami makes unique record

భారత మహిళా క్రికెట్ అల్ రౌండర్‌ జులన్‌ గోస్వామి ప్రత్యేక అవార్డును అందుకున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ మహిళా క్రికెట్ లో ఎవరూ అధిరోహించని ఉన్నత స్థానాన్ని అమె అధిరోహించి అరుదైన ఘనతను అందుకుంది. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ కోసం ప్రస్తుతం మిథాలీ రాజ్‌ నాయకత్వంలోని భారత మహిళల జట్టు సఫారీ గడ్డపై పర్యటిస్తూ తొలి వన్డేలో అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

ఈ మ్యాచు లక్ష్యఛేదనలో జులన్‌ గోస్వామి (4/24), శిఖా పాండే (3/23), పూనమ్‌ యాదవ్‌ (2/22) ధాటికి దక్షిణాఫ్రికా 43.2ఓవర్లలో 125 పరుగులకే కుప్ప కూలింది. దీంతో 88 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. అంతకుముందు 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన జులన్‌ గోస్వామి వెయ్యి పరుగుల మైలు రాయిని అందుకుంది. దీంతో అంతర్జాతీయ మహిళల వన్డే క్రికెట్‌లో వెయ్యికి పైగా పరుగులతో పాటు 150కి పైగా వికెట్లు తీసిన ఏకైక్‌ క్రికెటర్‌గా జులన్‌ గోస్వామి రికార్డు సృష్టించింది.

ఇప్పటి వరకు 165 వన్డేలాడిన జులన్‌ 97 ఇన్నింగ్స్‌ల ద్వారా 1003 పరుగులు సాధించింది. అలాగే 164 ఇన్నింగ్స్‌ల ద్వారా 199 వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణిగా 35 ఏళ్ల జులన్‌ అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs south africa  jhulan goswami  unique record  mithali raj  sports  cricket  

Other Articles