Shubman Credits Yuvraj for Success ఆ ప్రదర్శన క్రెడిట్ అంతా యూవీకే దక్కాలి

Shubman gill credits yuvraj singh for world cup success

ICC U19 WC, ICC U19 World Cup, ICC U19 World Cup 2018, ICC World Cup, ipl, IPL 2018, KKR, Shubman Gill, yuvraj singh, cricket, cricket news, sports news, latest sports news, sports

India's U-19 World Cup hero Shubman Gill said senior pro and veteran batsman Yuvraj Singh guided him and gave him batting tips in the past.

ఆ ప్రదర్శన క్రెడిట్ అంతా యూవీకే దక్కాలి

Posted: 02/06/2018 06:15 PM IST
Shubman gill credits yuvraj singh for world cup success

అండర్‌-19 ప్రపంచకప్‌ లో అద్వితీయమైన అటతీరును ప్రదర్శించి అభిమానుల అందరి చేత శభాష్ అనిపించుకున్న భారత ఆటగాడు శుభ్ మన్ గిల్ పై ఇప్పటికీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే ఈ మెగా టోర్నీలో రాణించిన క్రెడిట్‌ అంతా సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్ కే దక్కాలని  అంటున్నాడు‌. న్యూజిలాండ్‌ పర్యటన ముగించుకుని భారత జట్టు ముంబయి చేరుకున్న సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడాడు.

ప్రపంచకప్‌ టోర్నీకి వెళ్లే ముందు బెంగళూరులోని నేషనల్ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్నాం. ఆ సమయంలో యువరాజ్ సింగ్ అక్కడికి వచ్చాడు. బ్యాటింగ్ లో ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాడని చెప్పాడు. తనతో కలిసి బ్యాటింగ్ కూడా చేశాడని.. మైదానం లోపల, వెలుపల పరిస్థితుల గురించి వివరించాడు. అతని మార్గదర్శకాలు తన అద్భుత ప్రదర్శనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ టోర్నీలో నేను బాగా రాణించానంటే ఆ ఘనత అంతా యువీకే చెందుతుంది’ అని తెలిపాడు.

‘సెమీఫైనల్లో పాక్‌తో మ్యాచ్‌ సమయంలో కొంత ఒత్తిడికి గురయ్యానని,. మన ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారని చెప్పాడు. కానీ, ఆ తర్వాత వికెట్లు కోల్పోయాం. ఆ సమయంలో కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తన వద్దకు వచ్చి చివరి వరకు బ్యాటింగ్‌ చెయ్యాలని సూచించారు. ఆయన చెప్పినట్లే అనుకుల్‌ రాయ్ తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పానని శుభ్ మన్‌ వివరించాడు. పాక్‌తో జరిగిన సెమీఫైనల్లో శుభ్ మన్ 102 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC U19 World Cup  IPL 2018  KKR  Shubman Gill  yuvraj singh  cricket  

Other Articles