Shoaib Malik suffers delayed concussion signs మైదానంలో కుప్పకూలిన పాక్ క్రికెటర్

Shoaib malik shows delayed concussion signs after head blow

Shoaib Malik, Hamilton, New Zealand vs Pakistan, Mohammad Hafeez, Colin Munro, Colin de Grandhomme, 4th ODI, Sports news, latest news, sports, cricket news, cricket

Veteran Pakistan allrounder Shoaib Malik, who was hit on the head during the fourth one-day international against New Zealand in Hamilton on Tuesday, has shown signs of delayed concussion.

బంతి తగిలి మైదానంలో కుప్పకూలిన పాక్ క్రికెటర్

Posted: 01/17/2018 01:14 PM IST
Shoaib malik shows delayed concussion signs after head blow

న్యూజీలాండ్ లోని హమిల్టన్‌ వేదికగా జరుగుతున్న మ్యాచులో పాకిస్థాన్ వెటరన్ బ్యాట్స్ మన్ షోయబ్ మాలిక్ మైదనాంలోనే కుప్పకూలిపోయాడు. లేని పరుగు కోసం యత్నించి.. ఫీల్డర్ విసిరిన బంతి తలకు తగలడంతో.. కుప్పకూలిన మాలిక్.. బాధతో విలవిల్లాడిపోయాడు. ఈ ఘటన పాకిస్థాన్ సహా క్రికెట్ అభిమానులను మరోమారు అందోళనకు గురిచేయగా, రంగంలోకి దిగిన గ్రౌండ్ పారా మెడికల్ సిబ్బంది షోయబ్ ను మైదానం నుంచి బయటకు తీసుకెళ్లి చికిత్స అందించారు.

న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ జట్టు వన్డే సిరీస్ లో భాగంగా నాలుగో వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 32 వ ఓవర్‌లో షాట్ కొట్టిన మాలిక్ లేని పరుగు కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో మున్రో వైపుకు బంతి వెళ్లడాన్ని గమనించిన మరో ఎండ్ లోని బ్యాట్స్ మెన్ మహమ్మద్ హఫీజ్.. పరుగు తీయ వద్దని వారించాడు.

ఇంతలో బంతిని అందుకున్న ఫీల్డర్ మున్రో.. రన్ అవుట్ చేసే యత్నంలో భాగంగా బంతిని బలంగా వికెట్ల వైపు విసిరాడు. అది కాస్తా మాలిక్ తల వెనకవైపు బలంగా తాకింది. దీంతో విలవిల్లాడుతూ అక్కడే కుప్పకూలిపోయాడు. వైద్య సిబ్బంది అతడికి చికిత్స అందించడంతో కోలుకుని తిరిగి బ్యాటింగ్‌కు దిగాడు. అయితే దెబ్బ బలంగా తాకడంతో ఏకాగ్రత కోల్పోయిన మాలిక్ (6) ఆ వెంటనే అవుటయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles