Azharuddin slams HCA, demands fresh elections హెచ్.సీ.ఏపై టీమిండియా మాజీ కెప్టెన్ చిర్రుబుర్రు..

Azharuddin slams hca demands fresh elections

Indian cricket team, Mohammad Azharuddin, Hyderabad Cricket Academy, HCA, Indian Cricketer, Azharuddin, Justice Lodha Panel, Sports news, latest news, sports, cricket news, cricket

Slamming the Hyderabad Cricket Association (HCA), former Indian cricket team skipper Mohammad Azharuddin demanded fresh elections should be conducted.

హెచ్.సీ.ఏపై టీమిండియా మాజీ కెప్టెన్ చిర్రుబుర్రు..

Posted: 01/13/2018 05:17 PM IST
Azharuddin slams hca demands fresh elections

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విచారణ జరపాలని భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌ డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... హెచ్‌సీఏ పాలకవర్గం ఎన్నికలలో అక్రమాలకు పాల్పడుతూ హక్కులను ఉల్లంఘిస్తోందన్నారు. చదువుకున్న వ్యక్తులు కూడా ఈ విధంగా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. రాజకీయం వేరు క్రికెట్ జీవితం వేరని ఆయన తేల్చిచెప్పారు. తాను రాజకీయంగా యూపీ నుంచి పోటీ చేసినంత మాత్రాన అక్కడే రిజిస్టర్ చేసుకోవాలని చెప్పడం సమంజసం కాదని అన్నారు.

గ్రామీణ క్రీడాకారులకు అవకాశం ఇవ్వడం లేదు. జిల్లా, రూరల్‌ ప్రాంతాల నుంచి కూడా మంచి క్రీడాకారులు ఉన్నారు. హెచ్‌సీఏ నిర్వహించే టీ20 లీగ్‌ అంతా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోంది. ఆ లీగ్‌కు వివేక్‌ తన తండ్రి పేరు పెట్టడంపై అందరి ఆమోదం తీసుకోలేదు. హెచ్‌సీఏ లోగోతో వివేక్‌ తండ్రి వెంకటస్వామి పేరుతో టీ20 లీగ్‌ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమే.

ఇక బీసీసీఐ నుంచి తనకు క్లియరెన్స్‌ రాలేదని పాలక వర్గం ఆరోపించిందని అన్నారు. కానీ తనకు హైకోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చిందని.. దానిని నేను బీసీపీఐకి నివేదిక కూడా పంపానని అన్నారు. కోర్టు ఆదేశాలను బయటకు రానీయకుండా హెచ్ సీఏ అధ్యక్షుడు వివేక్‌ తప్పు చేశారు. అలాగే హెచ్‌సీఏ లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయడం లేదన్నారు. హెచ్‌సీఏ పాలకవర్గం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అజారుద్దీన్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohammad Azharuddin  BCCI  Cricket  Hyderabad SGM  Lodha panel  HCA  cricket  

Other Articles

 • Shikhar dhawan becomes 2nd fastest indian to reach 5000 odi runs

  అరుదైన ఘనతను అందుకున్న శిఖర్ ధావన్.!

  Jan 23 | టీమిండియా క్రికెటర్‌ శిఖర్‌ ధావన్ వన్డే కెరీర్‌ మరో కీలక మైలురాయిని చేరుకున్నాడు. దీంతో దిగ్గజాల సరసన చోటు దక్కించుకున్నాడు. అతి తక్కువ వన్డే ఇన్నింగ్స్‌ల్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్న టీమిండియా రెండో... Read more

 • India vs new zealand shami dhawan star as india register convincing win

  షమి, ధావన్ రాణించడంతో కివిస్ పై టీమిండియా విజయం..

  Jan 23 | అస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ ను కైవసం చేసుకుని విజయదరహాసంతో ముందుకు సాగుతున్న టీమిండియా.. అదే జోష్ తో న్యూజీల్యాండ్ లో అడుగుపెట్టి అక్కడ కూడా తొలి వన్డేను హస్తగతం చేసుకుంది. ఐదు వన్దేల... Read more

 • Mohammed shami becomes fastest indian to reach 100 odi wickets

  ఇర్ఫాన్ పఠాన్ రికార్డును బ్రేక్ చేసిన షమి

  Jan 23 | టీమిండియా పేసర్ మొహమ్మద్ షమి మరో రికార్డును తన ఖాతాలు వేసుకున్నాడు. 50 ఓవర్ల పరిమిత క్రికెట్లో అత్యంత వేగంగా (అతి తక్కువ మ్యాచులు) 100 వికెట్లు సాధించిన భారత బౌలర్ గా రికార్డును... Read more

 • Rahul dravid opens up on hardik pandya kl rahul criticism

  పాండ్యా, రాహుల్ వ్యాఖ్యలపై ద్రవిడ్ స్పందన..

  Jan 22 | బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్‌జోహ‌ర్ నిర్వ‌హించే `కాఫీ విత్ క‌ర‌ణ్‌` కార్య‌క్ర‌మంలో పాల్గొని టీమిండియా క్రికెట‌ర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్ప‌దం అయిన సంగ‌తి తెలిసిందే. అమ్మాయిల గురించి, శృంగారం... Read more

 • 103 and counting ms dhoni s average in successful odi chases soars

  కోహ్లీ చేజింగ్ రేట్ ను అధిగమించిన ధోని

  Jan 18 | టీమిండియా దిగ్గజం ధోనీ...ఆస్ట్రేలియా వన్డే సిరీస్ తో హాట్ టాపిక్ గా మారాడు. హ్యాట్రిక్ అర్థశతకాలతో తనపై వస్తోన్న విమర్శలకు బ్యాటుతోనే సమాధానమిచ్చాడు. టీమిండియా ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్ గా చిరిత్రపుటల్లోకి ఎక్కిన... Read more

Today on Telugu Wishesh