india beat sri lanka by 93 runs in cuttack T20 తొలి టీ20లో 93 పరుగులతో టీమిండియా ఘనవిజయం

1st t20i india crush sri lanka by 93 runs lead series 1 0

India vs Sri Lanka, Virat Kohli, Rohit Sharma, Cuttack, BCCI, 1st T20I, Rohit Sharma, India, MS Dhoni, yuzuvendra chahal, kuldeep yadav, barabati stadium, cuttack, hardik pandya, INDvSL, sports news, sports, cricket news, cricket, today match, today match score, today match updates

KL Rahul hit a classy half-century as India continued their domination over Sri Lanka to register a massive 93-run win, their biggest victory in T20 Internationals.

తొలి టీ20లో 93 పరుగులతో టీమిండియా ఘనవిజయం

Posted: 12/20/2017 09:58 PM IST
1st t20i india crush sri lanka by 93 runs lead series 1 0

పర్యాటక జట్టు శ్రీలంకతో కటక్ వేదికగా బారబతి స్టేడియంలో జరిగిన తొలి టీ-20 మ్యాచులో టీమిండియా ఘనవిజయాన్ని అందుకుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో సమిష్టిగా రాణించిన టీమిండియా.. శ్రీలంకను 93 పరుగులతో చిత్తుగా ఓడించింది. భారత స్పిన్నర్ల ధాటికి శ్రీలంక జట్టు 87 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా తొలి టీ-20లో 93 విజయాన్ని నమోదు చేసుకుంది.

అంతకుముందు టాస్ గెలిచిన శ్రీలంక జట్టు తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకోగా, బ్యాటింగ్ కు దిగిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్ లో రాహుల్(61), ధోని(39), పాండే(32), శ్రేయస్(24) పరుగులు చేశారు. అనంతరం 181 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆటగాళ్లు ఆరంభంలో కాస్త మెరుపులు మెరిపించారు. కానీ భారత బౌలర్ల దూకుడు ముందు నిలబడలేకపోయారు.

46 పరుగుల వరకూ కాస్త నిలకడగా ఆడిన లంక బ్యాట్స్‌మెన్లు ఆ తర్వాత వరుసగా పెవిలియన్ బాటపట్టారు. తరంగా(23), కుషల్(19), డిక్‌వెలా(13), చమీరా(12) మినహా మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే ఔట్ అయ్యారు. దీంతో శ్రీలంక 16 ఓవర్లు ముగిసేసరికి 87 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలింగ్ లో చాహల్ 4, హార్థిక్ 3, కుల్దీప్ 2, జయదేవ్ 1 వికెట్లు తీశారు. ఈ విజయంతో మూడు టీ-20ల సిరీస్ ను భారత్ 1-0తేడాతో లీడ్‌లో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  Dinesh Karthik  Cuttack  BCCI  1st T20I  MS Dhoni  chahal  kuldeep yadav  hardik pandya  cricket  

Other Articles