Kohli and Anushka meet PM Modi ప్రధానిని విందుకు అహ్వానించిన విరుష్క జంట

Newly weds virat kohli and anushka sharma meet pm modi

narendra modi, pm modi, anushka sharma, virat kohli, pm modi meets virat anushka, virushka wedding, virushka, virat anushka wedding italy, virat anushka reception, virat anushka reception delhi, cricket, sports news, cricket news, latest cricket news, latest sports news, latest news

Newly-weds Virat Kohli and Anushka Sharma met Prime Minister Narendra Modi on Wednesday, after returning from their destination wedding and honeymoon.

ప్రధానిని విందుకు అహ్వానించిన విరుష్క జంట

Posted: 12/20/2017 08:36 PM IST
Newly weds virat kohli and anushka sharma meet pm modi

టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా మోదీ వారిద్దరికి శుభాకాంక్షలు తెలిపారు. కోహ్లీ, అనుష్కశర్మల వివాహం డిసెంబర్ 11న ఇటలీలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. హనీమూన్ అనంతరం భారత్‌కు చేరుకున్న ఈ సెలబ్రిటీ జంట ప్రధాని మోదీని కలిసింది. గురువారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన తమ వివాహ రిసెప్షన్‌కు రావాల్సిందిగా ఆహ్వానించినట్లు సమాచారం. కాగా, మరో రిసెప్షన్ ఈనెల 26న ముంబైలో జరగనుంది.

ఫిన్లాండ్ లో హానీమూన్ ముగించుకుని క్రితం రోజున స్వదేశానికి చేరుకున్న ఈ కొత్త జంట.. నేరుగా విరాట్ కోహ్లీ స్వగృహంలో అడుగుపెట్టింది. తన భార్యను విరాట్ కోహ్లీ నేరుగా తన స్వగృహానికి తీసుకెళ్లాడం.. అక్కడ వీరిద్దరూ ఫోటోలు దిగడం అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడం అంతా చకచకా జరిగిపోయాయి. గులాబీ రంగు చీరలో అనుష్క, షేర్వాణీలో కోహ్లీలు ఆకట్టుకుంటున్నారు. రేపు ఢిల్లీలోని హోటల్ తాజ్ లో వీరు రిసెప్షన్ ఇవ్వనున్నారు. అనంతరం 26వ తేదీన ముంబైలో బాలీవుడ్ ప్రముఖులకు మరో రిసెప్షన్ ఇవ్వబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pm modi  anushka sharma  virat kohli  virushka wedding  reception  delhi  cricket  

Other Articles