Sehwag becomes Afridi's hat-trick victim టీ10లో ఆఫ్రిది హ్యాట్రిక్.. లభించెను సెహ్వాగ్ వికెట్.!

Shahid afridi hattrick in t10 cricket league 2017

Shahid Afridi Hattrick in T10 Cricket League 2017, Sehwag vs Afridi, Afridi amazing Over, Shahid Afridi Hattrick in T10 Cricket League 2017, Sehwag vs Afridi, Afridi amazing Over in T10 League, T10 League Afridi Hattrick 2017, afridi bowled sehwag on first bowl, afridi vs bravo, cricket, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Shahid Afridi began his T10 cricket stint with a bang as an inspired bowling spell helped the Pakhtoons pick up a victory in the newest format of the game.

టీ10లో ఆఫ్రిది హ్యాట్రిక్.. లభించెను సెహ్వాగ్ వికెట్.!

Posted: 12/15/2017 05:29 PM IST
Shahid afridi hattrick in t10 cricket league 2017

పాకిస్థాన్ మాజీ డ్యాషింగ్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరమణ పోందినా.. తనలో సత్తా మాత్రం తగ్గలేదని అంటున్నాడు. ఇన్నాళ్లు ఇదే విషయం చెప్పిన ఆయన తాజాగా జరుగుతున్న లీగ్ లో నిరూపించాడు. ఇక ఆయన బ్యాటు నుంచి పరుగుల వరద జాలువరుతుందేమోనని అభిమానులు ఎదురుచూసినా.. అది నెరవేరేలా లేదు.. అయితే తన చేతితో మాత్రం జాదూ వుందని అంటున్నారు. అదెలా అంటే ఆయన చేతి నుంచి విసిరిన బంతులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వరుస వికెట్లను తన ఖాతా వేసుకున్నాడు.

అదేంటి వరుస వికెట్లను తన ఖాతాలో వేసి.. నూతనంగా ప్రారంభమైన టీ10 లీగ్ లో హ్యాట్రిక్ నమోదు చేశాడు. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన టీ10 లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో వేసిన తొలి ఓవర్ మూడు బంతులకు మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ నమోదు చేశాడు. పక్తూన్స్ జట్టు తరపున ఆడుతున్న ఆఫ్రిది తాను వేసిన తొలి ఓవర్‌లోనే అద్భుతం చేశాడు. ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఔటైన ముగ్గురిలో ఒకరు మరాఠా అరేబియన్స్ కెప్టెన్ అయిన వీరేంద్ర సెహ్వాగ్ ఉండడం.

తొలి బంతికి సౌతాఫ్రికా బ్యాట్స్ మన్ రిలీ రోసౌ‌ను ఔట్ చేసిన ఆఫ్రిది, రెండో బంతికి డ్వాన్ బ్రావోను పెవిలియన్ పంపాడు. మూడో బంతికి సెహ్వాగ్ ను ఔట్ చేశాడు. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఫఖ్తూన్స్ జట్టు పది ఓవర్లలో 121 పరుగులు చేసింది. ఫకర్ జమాన్ 22 బంతుల్లో అజేయగా 45 పరుగులు చేశాడు. 122 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన మరాఠా అరేబియన్స్ జట్టు 25 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ 26 బంతుల్లో 57 పరుగులు చేసినా జట్టును పరాజయం నుంచి కాపాడలేకపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shahid Afridi  Hattrick  T10 Match  T10 Cricket League 2017  Sehwag vs Afridi  cricket  

Other Articles