‘Rohit Sharma has good heart,’ says Lanka’s top fan రోహిత్ శర్మ మనసు బంగారం: శ్రీలంక ఫ్యాన్

Rohit sharma has good heart says lanka s top fan

Cricket, ODI, India v/s Sri Lanka, Ind vs SL, eden gardens, kolkata, Sri Lanka, Rohit sharma, sri lankan fan, sports news,sports, latest sports news, cricket news, cricket

As Rohit Sharma went about hitting bowlers to all parts of the park in Mohali, a Sri Lanka fan back home was very happy for the opener's achievement, a record third double hundred in ODIs.

రోహిత్ శర్మ గోప్ప మనస్సున్నోడు: శ్రీలంక ఫ్యాన్

Posted: 12/14/2017 09:17 PM IST
Rohit sharma has good heart says lanka s top fan

ఆటగాడిగా తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ దేశంలోని క్రికెట్ అభిమానుల మనన్నలను పొందుతూ.. ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడే రోహిత్ శర్మ.. నిజ జీవితంలో మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఆయనకు పెద్ద మనసు వుందని రోహిత్ చాటుకున్నాడు. భారత్-శ్రీలంకల మధ్య జరుగుతున్న మ్యాచ్ లను చూసేందుకు మొహ్మద్ నిలామ్ అనే అభిమాని శ్రీలంక నుంచి ఇండియాకు వచ్చాడు.

అయితే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అతని తండ్రి ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. ఢిల్లీలో చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతని ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే బయల్దేరి వచ్చేయాలంటూ కుటుంబసభ్యులు చెప్పారు. అయితే, అప్పటికప్పుడు బయల్దేరేంత డబ్బు అతని వద్ద లేదు. ఈ నేపథ్యంలో, సచిన్ టెండూల్కర్ వీరాభిమాని అయిన సుధీర్ గౌతం ఈ విషయాన్ని రోహిత్ శర్మకు చెప్పాడు.

వెంటనే అతన్ని పిలిపించుకున్న రోహిత్... అతడికి రూ. 20 వేల నగదును అందజేశాడు. ఈ విషయాన్ని నిలామ్ స్వయంగా ఓ ఛానల్ కు వెల్లడించాడు. భారత జట్టు బస చేస్తున్న హోటల్ కు రోహిత్ తనను పిలిచి, సరిపడా డబ్బు ఇచ్చాడని తెలిపాడు. నాన్నకు సర్జరీ బాగా జరిగిందని చెప్పాడు. రోహిత్ మనసు చాలా గొప్పదని కొనియాడాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  Ind vs SL  rohit sharma  sri lankan fan  రcricket  

Other Articles