Gavaskar takes a jibe at these cricketers వారిద్దరి ఫీల్డింగ్ పై సన్నీ హాట్ కామెంట్స్

Sunil gavaskar points finger at two indian players over fielding

Cheteshwar Pujara, ind vs sl 2017, R Ashwin, Ravi Shastri, Ravindra Jadeja, sunil gavaskar, virat kohli, sports news, sports, latest sports news, cricket news, cricket

Former India skipper Sunil Gavaskar pulled up Cheteshwar Pujara and R Ashwin on the fifth day of delhi Test for failing to match the speed of the other players.

వారిద్దరి ఫీల్డింగ్ పై సన్నీ హాట్ కామెంట్స్

Posted: 12/07/2017 08:57 PM IST
Sunil gavaskar points finger at two indian players over fielding

శ్రీలంకతో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానం వేదికగా జరిగిన టెస్టులో చివరి రోజు ఆటలో భారత ఆటగాళ్ల ఫీల్డింగ్ ప్రదర్శన చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. అందివచ్చిన బంతులను పట్టలేకుండా చేజార్చడం, బౌండరీ లైన్‌ వద్ద బంతులు ఆపలేకపోవడం ఇవన్నీ చూసి అభిమానులు కాస్తంత అసహనానికే గురయ్యారు. గెలవాల్సిన మ్యాచ్ ను చేజేతులా వదిలేసుకున్నామంటూ కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. కోహ్లీ, జడేజా, సాహా మాత్రమే మైదానంలో చురుకుగా కదులుతున్నారని అన్నారు.

ఈ మ్యాచ్ కి భారత మాజీ క్రికెటర్‌ సునీల్ గావస్కర్ కామెంటేటర్ గా వ్యవహరించాడు. మైదానంలో భారత ఆటగాళ్ల ఫీల్డింగ్ నూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా పుజారా, రవిచంద్రన్ అశ్విన్ చేసే ఫీల్డింగ్ చూసి సన్నీ షాకైనట్టు చెప్పాడు. పక్క నుంచి బంతులు వెళ్తున్నా ఆపడంలో విఫలమయ్యారన్నాడు. మ్యాచ్ మధ్యలో ఓ సారి బౌండరీ లైన్ వద్ద బంతి ఆపేందుకు వెళ్తున్న పుజారాను ఉద్దేశించి ‘కారు హ్యాండ్ బ్రేక్ వేస్తే ఎలా నెమ్మదిగా వెళ్తుందో.. పుజారా అలా వెళ్తున్నాడు’ అని గావస్కర్ అన్నాడు. అలాగే అశ్విన్ ను ఉద్దేశించి ‘వికెట్లు తీసేందుకు శతవిధాల ప్రయతిస్తున్నారు. కానీ, విజయవంతం కాలేకపోతున్నారు’ అని అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles