Dhoni to retire after 2nd ODI in Mohali? లంకతో రెండో వన్డే తరువాత ధోని రిటైర్మెంట్..!

Dhoni to retire after india vs sri lanka 2nd odi in mohali

MS Dhoni, dhoni dog, India vs Sri Lanka, India vs Sri Lanka 2nd ODI, Mohali ODI, India vs Sri Lanka ODI series, PCA Stadium Mohali, Mohali Police, Mohali Police dog squad, MS Dhoni news

Dhoni will hang up his boots after the match. Dhoni is a sniffer dog working with the Mohali district police for the last 10 years. He is set to complete his service and retire after the match on December 13.

13న జరగనున్న రెండో వన్డే తరువాత ధోని రిటైర్మెంట్..!

Posted: 12/04/2017 09:15 PM IST
Dhoni to retire after india vs sri lanka 2nd odi in mohali

శ్రీలంకతో ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తరువాత.. పర్యాటక జట్టుదో మూడు వన్డేలు కూడా అడనుంది అతిథ్య జట్టు టీమిండియా. ఈ నేపథ్యంలో పంజాబ్ లోని మొహాలీలో జరగనున్న రెండో వన్డే అనంతరం ధోని తన కెరీర్‌కు వీడ్కోలు పలుకనున్నాడు. రెండో వన్డే అనంతరం తాను తన సుదీర్ఘ కెరీర్ కు గుడ్ బై చెప్పనున్నట్లు ఇప్పటికీ అధికారులు ప్రకటించేశారు. ఈ విషయం ఏ మాత్రం అనుమానం లేకుండా అధికారికంగా కూడా ప్రకటించేశారు. అయితే ధోని మాత్రమే రిటైర్ అవుతున్నాడు.. కానీ ఎంఎస్ ధోని కాదు. ఈ విషయాన్ని గ్రహించాలి లేదా.. ఇరుకున పడతారు జాగ్రత్త. కాసింత కన్ఫూజన్ గా వుంది కదూ.

ధోని రిటైర్మంట్ నిజమే కానీ టీమిండియా మాజీ కెప్టెన్ ధోని విషయాన్ని మేం చెప్పడం లేదు. అంటే మేము చెప్పే ధోని మొహాలీ పోలీసు విభాగంలో పనిచేస్తున్న భద్రతా జాగిలం. పంజాబ్‌ క్రికెట్ అసోషియేషన్ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న జాగిలం ధోని రిటైర్ కాబోతోంది. గత పదేళ్లుగా మొహాలీ జిల్లా పోలీసులకు ఈ స్నిఫర్ డాగ్ విశేష సేవలు అందిస్తోంది. ధోని కెరీర్ మంచి ఊపు మీద ఉన్న సమయంలో భద్రత విభాగంలోకి వచ్చిన ఈ జాగిలానికి ధోని పేరు పెట్టుకున్నారు. ధోని గ్రౌండ్ లో విజృంభిస్తే ఈ స్నిఫర్‌ డాగ్ డ్యూటీలో రెచ్చిపోయేదని పోలీసు వర్గాలు తెలిపాయి.

మొహాలీలో డిసెంబర్‌ 13న శ్రీలంకతో జరిగే రెండో వన్డే అనంతరం ఈజాగిలం సేవలకు అధికారులు స్వస్తి పలకనున్నారు. ఇందుకోసం పోలీసు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 2011 ప్రపంచకప్ లో భారత్‌-పాక్ ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ కు ఇరు దేశాల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ మ్యాచ్ కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను ఈ స్నిఫర్‌ డాగ్ తోనే తనిఖీ చేశారు. ఇది రోజుకు ఏడు గంటలే నిద్రపోయేదని, ప్రేలుడు పదార్ధాలు, బాంబులను పసిగట్టడంలో దిట్ట అని పోలీసులు తెలిపారు. ఎవరైన దీనిని దత్తత తీసుకోవాలి అంటే నామమాత్రపు ధర రూ.800లకే ఇస్తామని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Mohammed shami makes a big statement on patch up with wife

  ఇక అమెతో కలసి జీవించడం కుదరదు: షమి

  Mar 15 | టీమిండియా పేసర్‌ మహమ్మద్‌ షమి చాలా మంచోడని మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, ధోని సహా ఆయనకు పిల్లనిచ్చిన మామ కూడా మద్దతు పలికిన నేపథ్యంలో, ఆయన భార్య హసీన్‌ జహాన్‌ మాత్రం తన... Read more

 • Australia women seal odi series over india women with big win

  అసీస్ తో వన్డే సిరీస్ చేజార్చుకున్న టీమిండియా

  Mar 15 | వరల్డ్ కప్ లో సత్తాచాటిన టీమిండియా.. ద్వైపాక్షిక సిరీస్ లో మాత్రం కంగారులతో తడబాటుకు గైరంది. స్వదేశంలో జరుగుతున్నసిరీస్ లో ఒకటి తరువాత మరో మ్యాచులో కూడా ఓటమిని చవిచూసి వరుస పరాజయాలను ఎదుర్కొంది.... Read more

 • Psl 2018 sohail khan throws ball at yasir shah to get his attention

  పాకిస్తాన్ క్రికెట్ లీగ్ మళ్లీ ఇలా వార్తల్లోకి..

  Mar 15 | పాకిస్థాన్ సూపర్‌ లీగ్.. రికార్డులతో కాకుండా మైదానంలో ఆటగాళ్ల మధ్య చోటు చేసుకుంటున్న ఘటనలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల అఫ్రిది ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను ఔట్‌ చేసి పెవిలియన్ దారి చూపించి... Read more

 • Washington s spell up front was magical says rohit sharma

  సుందర్ స్పీన్ మాయాజలంతోనే నల్లేరుపై నడక..

  Mar 15 | టీమిండియా యువ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్ పై తాత్కాలిక కెప్టెన్ రోహిత్‌ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ 20 ముక్కోణపు టోర్నీలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచులో వాషింగ్టన్ సుందర్ తన స్పీన్... Read more

 • Dannielle wyatt to use virat kohli s bat during england tour of india

  అభిమాన క్రికెటర్ ఇచ్చిన బ్యాటుతోనే ట్రై సీరీస్ కు..

  Mar 13 | భారత పరుగుల యంత్రం, కెప్టన్ విరాట్ కోహ్లీకి బహిరంగంగా లవ్ ప్రమోజ్ చేసి.. తనను పెళ్లి చేసుకోవాలని అగిడిన మహిళా క్రికెటర్ గుర్తుందా..? ఎవరామె..? అంటారా.. అమె ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ డేనియెల్లి వాట్‌.... Read more

Today on Telugu Wishesh