Chamara Silva's outrageous shot వికెట్లను వదిలి షాట్ కొట్టబోయిన క్రికెటర్

Chamara silva tries to invent a new shot going behind the stumps

Cricket, Chamara Silva, Sri Lanka Cricket, Cricket, viral, viral video, ODI, India v/s Sri Lanka, Ind vs SL, sports news,sports, latest sports news, cricket news, cricket

Chamara Silva became a laughing stock on social media for his bizarre shot during a domestic game.

వికెట్లను వదిలి షాట్ కొట్టబోయిన క్రికెటర్

Posted: 11/22/2017 04:52 PM IST
Chamara silva tries to invent a new shot going behind the stumps

క్రికెట్ లో అటగాళ్లు తమదైన కొత్త షాట్లతో రెచ్చిపోవడం తెలిసిందే. అప్పటి వరకు ఎవరూ ప్రయత్నించని విధంగా ఆ షాట్లను కనిపెట్టి సక్సెస్ అవుతుంటారు. ఇక వాటికి పేర్లను కూడా పేట్టేందుకు క్రికెట్ పండితులు పోటీపడతారు. అలా వచ్చినవే ధోని హెలికాప్టర్ షాట్, సె‍హ్వాగ్ అప్పర్ కట్‌, దిల్షాన్ దిల్‌స్కూప్‌, డివిలియర్స్‌ రివర్స్ స్వీప్ షాట్లు. కానీ.. శ్రీలంక క్రికెటర్ చమర సిల్వా మాత్రం ఏకంగా కత్తి వప్రయత్నించి చతికిలబడ్డ ఓ షాట్ ను చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేరు. ఏ బ్యాట్స్‌మెన్‌ అయినా..

వికెట్లు ముందే బ్యాటింగ్‌ చేస్తాడు. కానీ చమరా దీనికి వినూత్నంగా ఆలోచించాడు.. తన పేరిట ఓ షాట్‌ క్రియేట్‌ చేద్దాం అనుకున్నాడో లేక త్వరగా అవుట్‌ కావలనుకున్నాడో  ఏమో కానీ వింతగా బ్యాటింగ్‌ చేసి నవ్వుల పాలయ్యాడు. లంక ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో  జరిగిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌ సోషల్‌ మీడియా తెగ వైరల్‌ అయింది. కొలంబో వేదికగా ఏమ్‌ఏఎస్‌ యునిచెల, తీజే లంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చమర సిల్వా ఫాస్ట్‌ బౌలర్‌ బౌలింగ్‌లో ఏకంగా వికెట్ల వెనుకకు పరుగెత్తి భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు.

కానీ ఆ బంతి కాస్త వికెట్లకు తగలడంతో నవ్వులపాలయ్యాడు. బంతి మాత్రం బ్యాట్‌కు తగిలితే చమర హీరో అయ్యేవాడని కొందరూ.. అతని భార్యతో బయటకు వెళ్లే పని ఉందో ఏమో.. అని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ మ్యాచ్‌లో చమర జట్టు 52 పరుగుల తేడాతో గెలిచింది. ఇక చమర ఇలా ఆడటం మెదటి సారే ఏం కాదు. ఇంతకు ముందు కూడా ఇలా నిర్లక్ష్యంగా ఆడటంతో లంకబోర్డు రెండేళ్ల నిషేదం విధించింది. ఇక చమర సిల్వా అంతర్జాతీయ క్రికెట్‌లో 11 టెస్టులు, 75 వన్డేలు, 16 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  Chamara Silva  Sri Lanka Cricket  Cricket  viral  viral video  cricket  

Other Articles