Sri Lanka survive scare as 1st Test ends in thrilling draw మలుపు తిరిగి డ్రాగా ముగిసిన రసవత్తర టెస్టు

Cheteshwar pujara third indian to bat on all five days of a test

Virat Kohli, bhuvaneshwar kumar, Suranga Lakmal, Ravindra Jadeja, KL Rahul, india v sri lanka 2017 cricket, India v Sri Lanka 2017, Dilruwan Perera, Cheteshwar Pujara, cricket news, sports news, latest sports news, latest cricket updates, sports, cricket

A brilliant last session, but light saves the day for the Sri Lankans. Virat Kohli and boys manage to pick 7 wickets and the Lankans manage to stay afloat with 3 wickets in the bag. Sri Lanka ends on 75/7 as the umpires shake hands.

డ్రా గా ముగిసిన తొలి టెస్టు.. భువికి మ్యాన్ అప్ ది మ్యాచ్

Posted: 11/20/2017 07:42 PM IST
Cheteshwar pujara third indian to bat on all five days of a test

పర్యాటక జట్టు శ్రీలంకతో కొల్ కతాలోని ఈడెన్ గార్డన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ నిరాశకు గురైంది. మ్యాచ్ అద్యంతం ప్రకృతి సహకారం టీమిండియాకు లభించలేదు. తొలి ఇన్నింగ్స్ లో మొదటి రెండు రోజులు లంకవైపే మొగ్గుచూపిన వరుణుడు.. టీమిండియా బ్యాట్స్ మెన్లు అటను అడ్డుకున్నాడు. అంతేకాదు అడపాదడపా అడిన అటలో ఏకంగా ఐదు వికెట్లను అర్పించేశాడు.

అలా కిందపడిన టీమిండియా ఆ తర్వాత పుంజుకుని, గెలుపు అంచుల వరకు వెళ్లిగా, ఒకింత అందోళనకు గురైన లంక జట్టును మళ్లీ ప్రకృతి కరుణించింది. సరైన వెలుతురు లేని కారణంగా మ్యాచ్ ను నిలిపేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. పేస్ బౌలర్లను ఎదుర్కొనేంత లైటింగ్ లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను ముగించారు. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 75 పరుగులు మాత్రమే చేసింది. మరో 19 ఓవర్లు వరకు మిగిలి ఉన్నాయి.

రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టులో 104 పరుగులతో కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ 79, ధావన్ 94 పరుగులతో స్కోరు బోర్డును కదిలించారు. మిగిలిన బ్యాట్స్ మెన్లలో పుజారా 22, షమీ 12, జడేజా 9, భువనేశ్వర్ 8, అశ్విన్ 7, సాహా 5, రహానే 0 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లక్మల్ 4, గమాగే 2, పెరీరా 2, సనక, హెరాత్ లు చెరో వికెట్ తీశారు.

అనంతరం లక్ష్యసాధనకు దిగిన లంక బ్యాట్స్ మెన్లు భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడారు. కెప్టెన్ చండిమల్ 20, డిక్ వెల్లా 27, మ్యాథ్యూస్ 12 మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మిగిలిన బ్యాట్స్ మెన్లలో సమరవిక్రమ డకౌట్, కరుణరత్నే 1, తిరిమన్నే 7, సనక 6 నాటౌట్, పెరీరా డకౌట్ , హెరాత్ 0 డకౌట్ అయ్యారు. భారత బౌలర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి లంక నడ్డి విరిచాడు భువనేశ్వర్ కుమార్. షమీ 2, ఉమేష్ యాదవ్ 1 వికెట్ల తీశారు. కాగా, రెండో టెస్టు నాగపూర్ లో నవంబర్ 24 నుంచి 28 వరకు జరగనుంది.  భువికే మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles