Spot-fixing is like cancer says: Waqar Younis మ్యాచ్ ఫిక్సింగ్ పై పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Spot fixing is like cancer boards should root out this problem waqar younis

waqar younis, waqar younis psl, pakistan super league, islamabad united, psl updates, cricket, sports news,sports, latest sports news, cricket news, cricket

Waqar also made it clear that more stringent anti-corruption measures should be taken by all boards if necessary and no player should be spared if found guilty of corruption.

మ్యాచ్ ఫిక్సింగ్ పై పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Posted: 11/17/2017 06:38 PM IST
Spot fixing is like cancer boards should root out this problem waqar younis

స్పాట్ ఫిక్సింగ్ క్యాన్సర్ తో సమానమని పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌ వకార్ యునిస్ అన్నారు. ప్రస్తుతం యూనిస్ పాకిస్తాన్ క్రికెట్ లీగ్ లో ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంఛైజీ జట్టుకు బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు. పాక్ ఆటగాళ్లు ఫిక్సింగ్ కు పాల్పడూతూ నిషేధానికి గురవుతున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ క్రికెట్ లీగ్ రెండో సీజన్ లోనూ పలువురు ఆటగాళ్లు ఫిక్సింగ్ కు పాల్పడినట్లు తేలడంతో ఆయన ఈ మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

జూదం, స్పాట్ ఫిక్సింగ్ క్యాన్సర్ తో సమానం. ఒక్క క్రికెట్ లోనే కాదు ఆటగాళ్లు ఏ క్రీడలోనైనా ఫిక్సింగ్ కు పాల్పడితే అది క్షమించరాని తప్పు. ఫిక్సింగ్ భూతాన్ని తరిమికొట్టాలంటే ఆ దేశ బోర్డులే జోక్యం చేసుకోవాలి. ప్రస్తుతం పలు దేశాల్లో 20లీగ్ ల హవా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో బోర్డులు, ఫ్రాంఛైజీల యాజమాన్యాలు ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అలా చేయకపోతే గత సీజన్ లో లాగానే ఫిక్సింగ్‌ భూతం తిరిగి పాకిస్తాన్ క్రికెట్ లీగ్ లో కనిపిస్తుందని అన్నారు. సల్మాన్‌ భట్‌, మహమ్మద్‌ ఆసిఫ్‌, మహమ్మద్‌ ఆమిర్‌ లు ఈ మేరకు శిక్షార్హులైన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : waqar younis  waqar younis psl  pakistan super league  islamabad united  psl updates  cricket  

Other Articles