Ricky Ponting could be new Delhi Daredevils coach ఢిల్లీ డేర్ డెవిల్స్ కోచ్ గా రికీ పాటింగ్

Ricky ponting could make his ipl return as head coach of delhi daredevils

IPL,Ricky Ponting,Mumbai Indians,Delhi Daredevils,Robin Singh,Rajasthan Royals,Paras Mhambrey,NCA,National Cricket Academy,BCCI cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Aussie batting legend Ricky Ponting could soon return to the Indian Premier League (IPL) to take up a head coach offer with the Delhi Daredevils.

ఢిల్లీ డేర్ డెవిల్స్ కోచ్ గా రికీ పాటింగ్

Posted: 11/17/2017 04:06 PM IST
Ricky ponting could make his ipl return as head coach of delhi daredevils

ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్ మెన్, మాజీ సారథి రికీ పాంటింగ్ భారతీయ క్రికెట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు మళ్లీ రానున్నారు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ కు రెండేళ్లు ప్రధాన కోచ్ గా వ్యవహరించిన రికీ పాంటింగ్.. ఇకపై ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జతకట్టనున్నారని సమాచారం. ఆయన శిక్షణలో ముంబై ఇండియన్స్ 2015లో విజేతగా నిలిచింది. 2016 సీజన్‌ అచ్చిరాలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు ఢిల్లీ నుంచి ఆఫర్‌ వచ్చినట్టు తెలుస్తోంది.

ఢిల్లీ ఆపర్ పై రికీ పాంటింగ్‌ సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయని సమాచారం. అయితే ఇయనే తమ జట్టుకు ప్రధాన కోచ్ గా వ్యవహరించాలని రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ ఐపీఎల్ పునరాగమనం చేస్తున్న రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా కోరుకుంటుందని తెలుస్తుంది. అయితే ఈ రెండు జట్ల నుంచి ఆఫర్ వచ్చినట్లు.. దీంతోనే పాంటింగ్ సందిగ్ధంలో పడినట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు చెప్పాయి.

కాగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేసిన టీమిండియా మాజీ పేసర్‌ టీఏ శేఖర్‌ ముంబయి ఇండియన్స్‌ శిబిరంలో చేరుతున్నట్టు వార్తలు వుస్తున్న క్రమంలో ఆయనతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సైతం చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. చాలామందితో తాము చర్చలు జరుపుతున్నట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ సీఈవో హేమంత్‌ దవా తెలిపారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన మేరకు ఢిల్లీ మెంటార్‌ రాహుల్‌ ద్రవిడ్‌ జట్టును వీడటంతోనే తాము అన్వేషణ ప్రారంభించాల్సి వచ్చిందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL  Ricky Ponting  Mumbai Indians  Delhi Daredevils  BCCI  cricket  

Other Articles