Hardik Pandya says sorry to fans for rest అభిమానులను క్షమాపణలు కోరిన హార్థిక్

I asked to be rested for sri lanka series says hardik pandya

Cricket, ODI, India v/s New Zealand, India vs Australia, India vs sri lanka, India vs south africa, Virat Kohli, Hardik Pandya, cricket fans, hardik pandya fans, sports news,sports, latest sports news, cricket news, cricket

Hardik Pandya has played 30 of 33 matches that India have been involved in since the Champions Trophy while bowling nearly 150 overs in ODIs.

అభిమానులను క్షమాపణలు కోరిన హార్థిక్

Posted: 11/15/2017 06:50 PM IST
I asked to be rested for sri lanka series says hardik pandya

టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా అభిమానులకు సారీ చెప్పాడు. ఇటీవల విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడిన పాండ్యా శ్రీలంకతో సిరీస్‌కు అందుబాటులో లేడు. విశ్రాంతి కావాలని స్వయంగా అడిగి మరీ జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అభిమానులను ఉద్దేశించి పాండ్యా మాట్లాడుతూ.. అతి తక్కువ మ్యాచ్ లు ఆడిన తాను విశ్రాంతి తీసుకోవడం ఏమిటని అభిమానులు భావిస్తే అందుకు తాను క్షమాపణలు వేడుకుంటున్నట్టు చెప్పాడు.

తానేమీ అబద్ధం ఆడడం లేదని, త్వరలో జరగనునున్న దక్షిణాఫ్రికా సిరీస్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు. అందుకోసమే విశ్రాంతి కోరానని, శరీరం ఇబ్బంది పెడుతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించాడు. ఈ సమయంలో తన ఫిట్‌‌నెస్ ను మరింత మెరుగుపరుచుకుంటానని స్పష్టం చేశాడు. చాలా తక్కువ మ్యాచ్ లే ఆడిన తాను విశ్రాంతి తీసుకోవడంలో అర్థం లేదని అభిమానులు భావిస్తే అందుకు వెరీ వెరీ వెరీ సారీ అని పాండ్యా పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles