Kohli’s message to Chahal that makes him successful నా విజయానికి విరాటిచ్చిన స్వేచ్ఛే కారణం

Virat kohli wants chahal to bowl attacking line pick wickets

Cricket, ODI, India v/s New Zealand, India vs australia, ind vs sl, IND vs NZL, India vs Srilanka, Ind vs SL, Virat Kohli, MS Dhoni, Yuzvendra Chahal, sports news,sports, latest sports news, cricket news, cricket

Yuzvendra Chahal revealed that the confidence showed by Virat Kohli has helped him perform better in limited-overs cricket.

నా విజయానికి విరాటిచ్చిన స్వేచ్ఛే కారణం

Posted: 11/13/2017 06:15 PM IST
Virat kohli wants chahal to bowl attacking line pick wickets

పరిమిత ఓవర్ల క్రికెట్ తనకు వికెట్ల రూపంలో విజయాలు వరించడానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీయే కారణమని యువ లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ అన్నాడు. విరాట్ కోహ్తీ తనపై ఉవచిన నమ్మకమే తనను విజయవంతమైన బౌలర్ గా తీర్చిదిద్దిందని అన్నాడు. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్ మెన్లకు నిర్భయంగా బంతులు విసిరేలా విరాట్‌ ప్రేరణ కల్పించాడని.. ఆయనిచ్చిన ఆత్మవిశ్వాసంతోనే తాము అటాకింగ్ బౌలింగ్ చేస్తున్నామని, దీంతోనే తాను విజయాలను అందుకున్నానని చెప్పాడు.

ఆస్ట్రేలియా వన్డే సిరీస్ లో 6, న్యూజిలాండ్ తో ఇటీవలే ముగిసిన 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్న చాహల్.. కోహ్లీ చెప్పిన ఎటాకింగ్ బౌలింగ్ సూత్రంతోనే ఇది సాధ్యమైందన్నారు. కొన్ని పరుగులు పోయినా ఫర్వాలేదు కానీ మద్య ఓవర్లలో కీలక వికెట్లు మాత్రం తీయాలని విరాట్ తనకు తరచూ చెబుతుంటాడని అన్నాడు. ఆయనిచ్చిన ప్రేరణతోనే తాను ఈ విజయాలను తన ఖాతాలో వేసుకోగలిగానన్నారు. ఇక టీ20 మ్యాచ్ లలో 30 పరుగులిచ్చినా.. మూడు వికెట్లు మాత్రం తీయాలని, దూకుడుగా బౌలింగ్‌ చేయాలని సలహా ఇస్తారన్నాడు.

ఇక విరాట్ ఇచ్చే ప్రేరణకు తోడు ధోని నుంచి లభించిన విశ్లేషణ కూడా నా విజయానికి దోహదం చేసిందని అన్నాడు. మిడిల్‌ స్టంప్ పై దాడి చేసేందుకు కోచింగ్‌ సిబ్బంది ఎప్పుడూ సాయపడుతుంటారు. ఇక మైదానంలో మహీ భాయ్‌ పరిస్థితిని చక్కగా విశ్లేషించి.. అ వెంటనే ఏం చేయాలో చెప్తారు. ఆఫ్ సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ బంతుల్లో వైవిధ్యం ఉంటుంది కానీ కచ్చితమైన ప్రదేశంలో బంతిని పిచ్‌ చేయాలి. అది ఖచ్చితంగా వేయడమే తన బలంమని చెప్పుకోచ్చాడు. అదే సమయంలో బంతిని మెల్లగా వేసి టర్న్‌ రాబట్టి బ్యాట్స్ మెన్ ను గందరగోళంలోకి నెట్టేసి వికెట్ రాబతానని చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  kohli india  yuzvendra chahal  india vs australia  india vs new zealand  cricket  

Other Articles