West Indies postpone T20I series in Pakistan పిసీబికి కష్టం.. వాయిదాకే విండీస్ నిర్ణయం

Blow for pakistan cricket as west indies refuse t20 series

Pakistan vs West Indies, T20I series, Cricket, PCB, Chris Gayle, Kieron Pollard, Dawyne Bravo

A big blow to Pakistan cricket, West Indies, who were supposed to travel to Pakistan for a three-match T20I series, have refused citing security concerns, claimed sources.

పిసీబికి జలక్.. వాయిదాకే విండీస్ నిర్ణయం

Posted: 11/09/2017 07:08 PM IST
Blow for pakistan cricket as west indies refuse t20 series

కష్టాల కడలిలో చిక్కుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి మొత్తంగా మునకకు చేరువుగా వచ్చేసినట్లే వుంది. అదుకునే అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న పాక్ క్రికెట్ బోర్డుకు లంకేయులు మినహా ఎవరూ దరిదాపుల్లో కూడా కనిపించడంలేదు. సమీపభవిష్యత్ లో అక్కడి పరిణామాలు మారుతాయన్న అశతో ఎ దేశమైన ముందుకువచ్చి పీసీబీతో ఒప్పందాలను కుదుర్చుకుంటుంది. కానీ.. తీరా సమయం అసన్నమైయ్యే సమయానికి తమతో కాదని, తటస్థ వేదికలే శరణ్యమని ప్రకటిస్తున్నాయి.

దీంతో మీకు పాకిస్తాన్ ను ముంచుతున్న కష్టాల కడలి ఏంటో తెలిసిపోయిందా..? అవునండీ పాకిస్థాన్ లో క్రికెట్ సిరీస్ లు అడేందుకు ఒప్పందాలు చేసుకున్న అన్ని జట్టు ఇప్పుడు ఆ దేశంలో తాము ఆటలేమని, అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లోకి తాము తమ క్రీడాకారులను పంపలేమని తేల్చచెబుతూ.. తటస్థ వేదికలపై అడుదామని చెబుతున్నాయి. తాజాగా వెస్టిండీస్ జట్టు కూడా దేశంలో అడతామని కుదర్చుకున్న ఒప్పందంపై వెనకంజ వేసింది.

పాకిస్థాన్ తో జరగాల్సిన మూడు టీ20లను తటస్థ వేదికలపై అడుతామని చెప్పేసింది. తమ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా పాకిస్థాన్ కు పంపేలేమని విండీస్ బోర్డు స్పస్టం చేసింది. తటస్థ వేదికలు లభించని పక్షంలో సిరీస్ ను వాయిదా వేయడమే మేలని తలస్తోంది. అదే కనుక జరిగితే పాక్ క్రికెట్ బోర్డు మరిన్ని నష్టాల్లో కూరుకుపోవడం ఖాయం. ఇప్పటికే గతేడాది విండీస్ జట్టు పాక్ లో అడేందుకు నిరాకరించింది. అదే పరిస్థితి ఇప్పుడు మళ్లీ తలెత్తడంతో పీసీబీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan vs West Indies  T20I series  Cricket  PCB  Chris Gayle  Kieron Pollard  Dawyne Bravo  

Other Articles