136 wides during a U-19 women's ODI match పోటీ పడి వైడ్ బంతులు విసురుకున్నారు..

Manipur nagaland bowl 136 wides during a u 19 women s odi match

Nagaland, Manipur, wide balls, record wide balls, U-19 Women's Cricket, BCCI, sports, cricket

In an embarrassing situation for both teams involved, a U-19 women's one day match organized by the BCCI saw an astounding 136 wide deliveries bowled during the match.

పోటీ పడి వైడ్ బంతులు విసురుకున్నారు..

Posted: 11/02/2017 05:44 PM IST
Manipur nagaland bowl 136 wides during a u 19 women s odi match

క్రికెట్ మ్యాచ్ లో వైడ్ బాల్స్ ఒక్కోసారి ఫలితాల్ని ప్రభావితం చేస్తుంటాయి. అందుకే బౌలర్లు చాలా జాగ్రత్తగా బంతులు విసురుతుంటారు. ఒక మ్యాచులో ఆరేడు వైడ్లు ఉంటేనే ఎక్కువ. అలాంటిది ఏకంగా 136 వైడ్లు అంటే.. వినడానికి ఆశ్చర్యమే. అతిశయోక్తిగా ఉన్నా ఇది నిజం. అది కూడా భారత్ లో జరిగిన మ్యాచులో ఈ ఘటన చోటుచేసుకుంది.

బీసీసీఐ ఆధ్వర్యంలో జార్ఖండ్ లోని ధన్ బాద్ లో అండర్-19 మహిళల వన్డే టోర్నీ జరుగుతోంది. మణిపూర్-నాగాలాండ్ జట్లు తలపడగా తొలుత బౌలింగ్ చేసిన మణిపూర్ జట్టు ఏకంగా 94 వైడ్లు వేయగా, నాగాలాండ్ జట్టు కూడా ఏమాత్రం తీసిపోకుండా 42 వైడ్లు వేసింది. మొత్తంగా ఒక మ్యాచులో 136 వైడ్లు నమోదయ్యాయి.

తొలుత బ్యాటింగ్ చేసిన నాగాలాండ్ జట్టు 38 ఓవర్లలో 215 పరుగులు చేయగా అందులో వైడ్ల ద్వారా వచ్చినవే 94 పరుగులు. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన మణిపూర్ జట్టు 27.3 ఓవర్లలో 98 పరుగులకే ఆలౌటైంది. మణిపూర్ చేసిన 98 పరుగుల్లో 42 పరుగులు వైడ్ల ద్వారా వచ్చినవే కావడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagaland  Manipur  wide balls  record wide balls  U-19 Women's Cricket  BCCI  sports  cricket  

Other Articles