Kohli reveals reason for defeat in Mumbai పూర్తి సామర్ధ్యాన్ని ప్రదర్శించలేకపోయాం, అందుకే..

Virat kohli reveals reason for hosts defeat in mumbai

Cricket, ODI, India v/s New Zealand, Ind vs NZL, Mumbai, New Zealand, Virat Kohli, Tom Latham, Ross Taylor, Kane Williamson, Kedar Jadhav, Kuldeep Yadav, Yuzvendra Chahal, Trent Boult, Hardik Pandya, sports news,sports, latest sports news, cricket news, cricket

India captain Virat Kohli admitted that they were at least 30 runs short but at the same time praised the application of the New Zealand batsmen especially Tom Latham.

పూర్తి సామర్ధ్యాన్ని ప్రదర్శించలేకపోయాం, అందుకే..

Posted: 10/23/2017 12:44 PM IST
Virat kohli reveals reason for hosts defeat in mumbai

ముంబైలోని వాంఖేడ్ స్టేడియం వేదికగా న్యూజీలాండ్ తో జరిగిన తొలి వన్డేలో తమ జట్టు ఓటమి పాలుకావడానికి పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించకపోవడమేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. తమ జట్టు బ్యాటింగ్ లో మరింతగా రాణించాల్సి వుందని.. మరో 30 నుంచి 40 పరుగులు చేసి వుంటే విజయం తమనే వరిందేదని అభిప్రాయపడ్డాడు. పూర్తి స్థాయి బ్యాటింగ చేయకపోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమన్నాడు. మరింత మెరుగైన బ్యాటింగ చేసి వుండివుంటే.. మరిన్ని పరుగుల్ని స్కోరు బోర్డుపై ఉంచగలిగే వాళ్లమని, దాంతో ప్రత్యర్థి జట్టులో అందోళన వ్యక్తమై విజయం సాధించేవాళ్లమని అన్నాడు.

తాము బ్యాటింగ్ దిగిన సమయంలో నిర్దేశించుకున్న టార్గెట్ వేరు. అయితే అచరణలో దానికన్నా 20-30 పరుగులు తక్కువే చేశామని అన్నాడు. తాము లక్ష్యాన్ని నిర్దేశించిన దానికి మరో 40 పరుగులు అదనంగా చేయాల్సిందని అన్నాడు. టాపార్డర్ విఫలం కావడం వల్ల అనుకున్న పరుగుల్ని సాధించలేకపోయామని అదే తమ జట్టుపై ప్రభావం చూపి..ఓటమికి కారణమయ్యిందని కోహ్లీ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నాడు.

ఇదిలా ఉంచితే, రెండొంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్సి కివీస్ కు శుభారంభాన్ని అందించిన టామ్ లాథమ్-రాస్ టేలర్ లపై కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు.ఇక్కడ 275 పరుగులు మంచి స్కోరు అనుకున్నప్పటికీ, దాన్ని లాథమ్-టేలర్ తిప్పికొట్టారన్నాడు. తమకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా కివీస్ గెలుపులో కీలక పాత్ర పోషించారన్నాడు. కచ్చితంగా న్యూజిలాండ్ గెలుపు వారిద్దరిదే అనడంలో ఎటువంటి సందేహం లేదని కోహ్లి కొనియాడాడు.

కొన్ని మ్యాచ్ ల నుంచి కేఎల్ రాహుల్ ను పక్కనబెట్టడాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశ్నించాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు రాహుల్ ను పక్కన పెట్టడంపై విస్మయం వ్యక్తం చేశాడు. భారత క్రికెట్ కు రాహుల్ ఒక ఆశాకిరణమని... అలాంటి ఆటగాడు జట్టులో లేకపోవడం సరైనది కాదని దాదా అన్నాడు. రాహుల్ జట్టులో ఉండటం చాలా అవసరమని... వెంటనే అతన్ని ఆడించే ప్రయత్నం చేయాలని తెలిపాడు. విదేశీ పర్యటనల్లో కూడా రాహుల్ బాగా రాణించాడని... టాలెంట్ ను పక్కన పెట్టకుండా రాహుల్ ను ప్రోత్సహించాలని సూచించాడు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs New Zealand  Ind vs NZL  Mumbai  Virat Kohli  Tom Latham  cricket  

Other Articles