secret behind Dhoni handing trophies to the youngsters ఇన్నాళ్లకు అసలు రహస్యాన్ని చెప్పిన ధోని

Ms dhoni secret behind handing trophies to the youngsters

MS Dhoni, MS Dhoni captaincy, MS Dhoni reveals, MS Dhoni give away the trophy to youngsters, MS Dhoni captain, MS Dhoni records, MS Dhoni wicket-keeping, MS Dhoni batting, MS Dhoni sixes, MS Dhoni giving trophies to youngsters, sports news, cricket news, cricket news, sports news, Team India, cricket

Dhoni unveiled the suspense of handing over the trophies to the youngsters after every series win throughout his captaincy career.

ఇన్నాళ్లకు అసలు రహస్యాన్ని విప్పిన ధోని

Posted: 10/18/2017 06:53 PM IST
Ms dhoni secret behind handing trophies to the youngsters

సిరీస్ లు గెలిచిన వెంటనే ట్రోఫీలను యువ ఆటగాళ్లకు అందజేయడం టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న అలవాటు. జట్టు సభ్యులతో ఛాంపియన్ ఫొటో తీసుకునేటప్పుడూ చివరికెళ్లి నిలబడతారు. ఆయన ఇలా ఎందుకు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా! ఈ చర్య వెనకున్న రహస్యాన్ని ధోనీ ఇప్పుడు చెప్పేశారు. కుర్రాళ్లకు ట్రోఫీ అందిస్తే వారికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, భవిష్యత్తులో ఇంకా మెరుగైన ప్రదర్శన చేసేలా ప్రేరణనిస్తుందని ధోనీ చెప్పారు.

 ‘అందుకే అలా చేస్తా. సిరీస్‌లో బాగా రాణించిన యువ ఆటగాళ్లకు ట్రోఫీ అందజేస్తే అది వారిని అభినందించినట్టుగా ఉంటుంది. వారి ప్రదర్శనకు గుర్తింపుగా భావిస్తారు. అది వారిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఏదేమైనప్పటికీ మనం ట్రోఫీ గెలిచాం. అది ఎవరి చేతుల్లో ఉంటే మాత్రం ఏమిటి! అదే నేను వారికి అందజేస్తే భవిష్యత్తులో వారు బాగా రాణిస్తే అది నాకే లాభం. ఈ చర్య వల్ల ఇద్దరికీ ప్రయోజనమే’ అని అన్నారు. ప్రస్తుత టీమిండియా సారథి విరాట్‌కోహ్లీ సైతం ఇదే బాటలో నడుస్తున్నారు. ట్రోఫీని ఆటగాళ్లకు ఇచ్చి చివరికి నిలబడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Trophies  MS Dhoni  Team india  Virat kohli  bcci  cricket  

Other Articles