Ranji Trophy: Bengal's 9 slips ఇది నిజంగానే అరుదైన ఫీల్డింగ్ గురూ..!

Shami dinda operate with nine slips during ranji trophy match

ranji trophy, mohammed shami, ashoke dinda, fielding, chattisgarh, west bengal, ranji match, cricket, cricket news, latest sports news, sports news, latest news, cricket

This was after Chattisgarh were reduced 109/9 in their second innings which prompted captain Manoj Tiwary set up a nine-man slip cordon to snare the last wicket.

ఇది నిజంగానే అరుదైన ఫీల్డింగ్ గురూ..!

Posted: 10/18/2017 05:51 PM IST
Shami dinda operate with nine slips during ranji trophy match

జింబాబ్వేపై అస్ట్రేలియా మ్యాచ్ లో గ్లెన్ మక్ గ్రాత్ బౌలింగ్ చేస్తున్న క్రమంలో కనిపించిన ఫిల్డిండ్ మళ్లీ ఇన్నాళ్లు కనిపించింది. అదీ రంజీ ట్రోఫీలో మ్యాచ్ లో. ఈ ఫోటోను పరిశీలిస్తే అర్థమవుతుంది కదూ. రంజీ మ్యాచ్ లో భాగంగా నిన్న జరిగిన ఓ మ్యాచులో ఫీల్డర్లందరూ స్లిప్‌లోనే నిల్చుని బాధ్యతలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌-ఛత్తీస్ గఢ్ ల మధ్య మ్యాచ్‌ సందర్భంగా ఇలాంటి సన్నివేశం మళ్లీ కనిపించింది.

ఈ మ్యాచ్‌లో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. తొమ్మిది మంది ఫీల్డర్లు స్లిప్‌లోనే నిల్చుని ఫీల్డింగ్‌ నిర్వహించడం ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోను షమి సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. బెంగాల్‌ బౌలర్లు మహమ్మద్‌ షమి, అశోక్‌ దిండా.. బ్యాట్స్‌మెన్‌కు పరుగులు దక్కకుండా కట్టడి చేసేందుకు తొమ్మిది మంది ఫీల్డర్ల చేత స్లిప్‌లోనే ఫీల్డింగ్‌ చేయించారు. ఛత్తీస్‌గఢ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానుల్ని అలరిస్తోంది.

బెంగాల్ తన తొలి ఇన్నింగ్స్ ను 529/7 వద్ద డిక్లేర్ చేసింది. దిండా ధాటికి ఛత్తీస్‌గఢ్ తన తొలి ఇన్నింగ్స్ లో కేవలం 110 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో షమి దాటికి 259 పరుగులకే కుప్పకూలింది. దీంతో బెంగాల్ ఇన్నింగ్స్ 160 పరుగుల తేడాతో విజయం సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ranji trophy  mohammed shami  ashoke dinda  fielding  chattisgarh  west bengal  ranji match  cricket  

Other Articles