Kerala HC restores life ban on Sreesanth శ్రీశాంత్ కు కేరళ హైకోర్టు షాక్.. తీర్పుపై పెదవివిరువు..

Worst decision ever says sreesanth after high court upholds life ban

Sreesanth, cricket, BCCI, Kerala High Court, IPL, Kerala, Indian cricket team, Rajasthan Royals, S. Sreesanth, cricket, cricket news, latest sports news, sports news, latest news, cricket

The Kerala high court upheld the appeal made by the BCCI against the earlier single bench verdict that lifted the life ban on the bowler.

శ్రీశాంత్ కు కేరళ హైకోర్టు షాక్.. తీర్పుపై పెదవివిరువు..

Posted: 10/17/2017 08:46 PM IST
Worst decision ever says sreesanth after high court upholds life ban

కేరళకు చెందిన ఫాస్ట్‌బౌలర్‌ శ్రీశాంత్‌కు కేరళ హైకోర్టు షాకిచ్చింది. అతడిపై ఎత్తివేసిన జీవితకాల నిషేధాన్ని పునరుద్ధరించింది. అంతకుముందు బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ కేరళ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీనిపై బీసీసీఐ అప్పీల్‌ చేయడంతో ఆ తీర్పును కొట్టివేస్తూ.. బీసీసీఐ నిషేధాన్నిహైకోర్టు ధర్మాసనం సమర్థించింది.

గత రెండు రోజులుగా ఈ కేసుకు సంబంధించిన వాదనలు వింటున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నవీన్‌ ప్రసాద్‌తో కూడిన ధర్మాసనం.. మంగళవారం ఈ తీర్పును వెలువరించింది. మరోసారి ఈ అంశంపై జుడీషియల్‌ రివ్యూ చేయబోమని స్పష్టంచేసింది. దీంతో రంజీ మ్యాచ్‌లకు సిద్ధమవుతున్న శ్రీశాంత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బీసీసీఐ గానీ, ఇతర రాష్ట్రాల క్రికెట్‌ సంఘాలు నిర్వహించే ఏ మ్యాచ్‌లోనూ శ్రీశాంత్‌ పాల్గొనే వీలులేకుండా పోయింది.

ప్రస్తుతం శ్రీశాంత్‌కున్న ఏకైక మార్గం సుప్రీం కోర్టును ఆశ్రయించడమే. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లాలని శ్రీశాంత్‌ భావిస్తున్నారని ఆయన సన్నిహితుడొకరు వెల్లడించారు. ఐపీఎల్‌-6 సీజన్‌లో స్పాట్‌ఫిక్సింగ్‌ ఆరోపణల నేపథ్యంలో శ్రీశాంత్‌తో పాటు, అంకిత్‌ చవాన్‌, అజిత్‌ చండీలాపై బీసీసీఐ జీవితకాల నిషేధాన్ని విధించిన సంగతి తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sreesanth  cricket  BCCI  Kerala High Court  IPL  Kerala  Indian cricket team  Rajasthan Royals  S. Sreesanth  

Other Articles