Hashim Amla breaks Virat Kohli's record విరాట్ రికార్డులపై తనపేరును రాసుకుంటున్నాడు..

Hashim amla breaks virat kohli s record

hashim amla, south africa, Virat Kohli, India vs Australia, Team India, fastest century, sports news, cricket, news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

Hashim Amla took 154 innings to reach 26 ODI hundreds which is the least. Virat Kohli held the record previously having completed 26 centuries in 166 innings with Sachin Tendulkar and Ricky Ponting at third and fourth.

విరాట్ రికార్డులపై తనపేరును రాసుకుంటున్నాడు..

Posted: 10/16/2017 06:50 PM IST
Hashim amla breaks virat kohli s record

టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డులపై వరుసగా తన పేరును రాసుకుంటూ.. చడీచప్పుడూ లేకుండా దూసుకువస్తున్న క్రికెటర్ ఎవరో తెలుసా..? దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా. నిజమండీ.. విరాట్ రికార్డుల మీద తన పేరును లిఖించుకుంటూ వస్తున్నాడు. అదెలా అంటారా..? క్రికెట్ దిగ్గజాలు సృష్టించిన రికార్డులను కోహ్లీ బద్దలు గొట్టి తన పేరును లిఖించుకుంటూ వచ్చాడు. అయితే తాజాగా విరాట్ లిఖించుకున్న రికార్డులను మాత్రం అమ్లా అంతే వేగంగా బద్దలు కొడుతూ.. తానున్నానంటూ వస్తున్నాడు.

బంగ్లాదేశ్ తో ఆదివారం ఇక్కడి డైమండ్ ఓవల్ మైదానంలో జరిగిన వన్డేలో ఆమ్లా 110 పరుగులతో నాటౌట్ గా నిలిచి 26 సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా అత్యంత వేగంగా ఈ ఘనతను సాధించిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. కోహ్లీ తన 26వ సెంచరీని 166వ ఇన్నింగ్స్‌లో చేయగా, ఆమ్లా 154 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించాడు. ఇప్పటికే కోహ్లీ అత్యంత వేగంగా సాధించిన 2 వేలు, 3 వేలు, 4వేలు, 5వేలు, 6వేలు, ఏడువేల పరుగుల రికార్డులను కూడా బద్దలు కోట్టిన ఆమ్లా వాటిని తన పేరున లిఖించుకున్నాడు. ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తావో చేయ్.. నేను బద్దలుగొట్టేందుకు రెడీ అంటూ సవాల్ విసురుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hashim amla  south africa  Virat Kohli  India vs Australia  Team India  cricket  

Other Articles